Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
ఇలాంటి పచ్చడి మీరు జీవితంలో తిని ఉండరు, అన్నం టిఫిన్స్‌లో అదిరిపోతుంది, ఎలా చేసుకోవాలంటే?
నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ఈ నువ్వులతో చేసే నూనె దేవుడికి నైవేద్యానికి కూడా సమర్పిస్తారు. నువ్వులను వివిధ రకాల స్వీట్స్ చేసుకోవడంతో పాటు పలు వంటల్లో కూడా వినియోగిస్తారు. అయితే ఈ నువ్వులతో చేసుకునే పచ్చడి మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుంది. ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అద్భుతమైన రుచి ఉంటుంది. దీనిని ఎలా చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నువ్వుల పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
నువ్వులు - 1 కప్పు
ఎండు మిర్చి - 5-6 (మీ రుచికి తగినట్లు)
చింతపండు - చిన్న ముద్ద
వెల్లుల్లి రెబ్బలు - 4-5
జీలకర్ర - 1/2 టీస్పూన్
ఆవాలు - 1/2 టీస్పూన్
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత

నువ్వుల పచ్చడి తయారీ విధానం:
ముందుగా, నువ్వులను ఒక పాన్‌లో వేసి దోరగా వేయించుకోవాలి. అవి చిటపటలాడే వరకు వేయించాలి, కానీ మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అలా వేయించిన నువ్వులను ఒక ప్లేట్‌లో తీసుకొని చల్లారనివ్వాలి.
ఇప్పుడు ఎండు మిర్చిని కూడా అదే పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేయించుకోవాలి. అలాగే చింతపండును కొద్దిగా నీటిలో నానబెట్టాలి. ఆ తరువాత వేయించిన నువ్వులు, ఎండు మిర్చి, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీరు కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న పాన్‌లో నూనె వేసి ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఈ తాలింపును పచ్చడిలో కలపాలి. అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నువ్వుల పచ్చడి సిద్ధమైనట్లే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
