Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇడ్లీలు దూదిలాగా మెత్తగా రావాలా?.. సింపుల్‌గా ఎలా చేసుకోవాలో తెలుసా? ఈ టిప్స్ పాటిస్తే సరి!
ఇడ్లీ అంటే అందరికీ ఇష్టముంటుంది. పైగా ఇడ్లీని నూనె లేకుండా తయారు చేస్తారు కాబట్టి, ఈ అల్పాహారాన్ని ప్రతిఒక్కరూ ఎంతో తింటూ ఉంటారు. పైగా ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కాబట్టి, చాలా మంది దీన్ని తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. సాధారణంగా హోటళ్లలో చేసే ఇడ్లీలు చాలా మెత్తగా దూదిలాగా ఉంటాయి. కానీ మనం ఇంట్లో చేసుకునే ఇడ్లీలు మాత్రం అలా ఉండవు.
మనం ఇంట్లో చేసుకునే ఇడ్లీలు కూడా హోటళ్లలో మాదిరిగా మెత్తగా దూదిలాగా చేసుకోవాలంటే పిండి కలుపుకునే విధానంలో ఉంటుంది. ముఖ్యంగా రేషన్ బియ్యంతో చేసే పిండితో ఇడ్లీలు చాలా మెత్తగా, దూదిలాగా అవుతాయట. అయితే రేషన్ బియ్యంతో ఎలా ఇడ్లీలు చేసుకోవాలి? పిండిని ఎలా కలుపుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రేషన్ బియ్యం నుంచి ఇడ్లీ చేయడానికి కావలసిన పదార్థాలు
- నాలుగు కప్పుల రేషన్ బియ్యం
- ఒక కప్పు పప్పు
- మూడు కప్పుల మంచి బియ్యం
- ఒక చెంచా చక్కెర
- రుచికి సరిపడా ఉప్పు
- కొద్దిగా నూనె
రేషన్ బియ్యంతో ఇడ్లీ ఎలా తయారు చేయాలి?
- ఈ రేషన్ బియ్యంతో ఇడ్లీలు తయారు చేయడానికి రెండు కప్పుల బియ్యం తీసుకొని ఒక పాత్రలో నానబెట్టాలి. అలాగే మినపప్పును ఒక పాత్రలో వేసి బాగా కడిగి నానబెట్టుకోవాలి. అందులోనే ఒక చెంచా మెంతులు, వేసుకొని సుమారు అయిదు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆరు గంటల తరువాత మెత్తగా నానిన తరువాత.. ఒక మిక్సీ జార్లో మినపప్పును మెత్తగా రుబ్బుకోవాలి. ఒక చెంచా నీరు పోసుకొని మెత్తగా రుబ్బుకుంటే పిండి మెత్తగా వస్తుంది. ఆ పిండిని ఒక పాత్రలో తీసుకోవాలి.
- తరువాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా మిక్సీలో వేసుకొని రుబ్బుకోవాలి. బియ్యాన్ని రుబ్బుకునేటప్పుడు అందులో నీళ్లు పోసుకోకుండా రుబ్బుకోవాలి. బియ్యం మొత్తాన్ని రుబ్బుకున్న తరువాత.. మనం ముందుగా తీసుకున్న రేషన్ బియ్యాన్ని కూడా చాలా మెత్తగా రుబ్బుకోవాలి. అనంతరం మినపప్పు.. ఇంట్లో తీసుకున్న బియ్యం పిండి, రేషన్ బియ్యం పిండిని ఒక పాత్రలోకి తీసుకోవాలి.
- అందులోనే ఒక అర చెంచా పంచదార, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని చేతితో గిలకొట్టుకోవాలి. సుమారు మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కలుపుకోవాలి. ఆపై దానిని ఒక వెచ్చని ప్రదేశంలో ఉంచి దానిపై గుడ్డను ఉంచి రాత్రంతా అలాగే ఉంచేయాలి. ఉదయం మూత తీసి మందంగా, ఉబ్బినట్లు ఉంటుంది.
- ఆ పిండిని ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు ఉందొ లేదో చూసుకోవాలి. ఉప్పు పడితే ఒకసారి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అనంతరం ఇడ్లీ పిండిని తీసుకొని ఇడ్లీ పాత్రలో కొంచెం నూనె పూసుకొని, దానిపై ఇడ్లీ వేసుకోవాలి. అనంతరం దానిపై కొంచెం మైదా పిండిని చల్లుకోవాలి. అనంతరం దానిని పదిహేను నిమిషాల పాటు స్టీమ్‌లో ఉంచుకుంటే.. ఇడ్లీ బాగా ఉడికిపోతుంది. ఆ ఇడ్లీని బయటికి తీసి చూస్తే.. ఇడ్లీలు దూదిలాగా మెత్తగా పత్తిలాగా ఉంటాయి. వాటిపై కొబ్బరి చట్నీతో పోసుకొని కొద్దిగా నెయ్యి తలిగించి తింటే.. ఆ రుచి వేరే లెవెల్.
- ఈసారి మీరు కూడా మీ ఇంట్లోకి వచ్చే రేషన్ బియ్యాన్ని వృధా చేయకుండా.. ఇలా ఇడ్లీలు తయారు చేసుకోండి. అద్భుతమైన రుచితో మీ రోజును ప్రారంభించండి. రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్‌కు కూడా షేర్ చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications