Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
Sorakaya Payasam: సొరకాయ పాయసం..నోట్లో పెట్టుకుంటే అమృతమే..ఇలా చేస్తే స్టార్ హోటల్ కి మించిన టేస్ట్
సొరకాయ అనే పేరు వింటేనే చాలామంది అబ్బా అంటారు. వాస్తవానికి ఎక్కువమంది దీన్ని తినడానికి ఇష్టపడరు. అయితే సొరకాయ అనేది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అలాగే సొరకాయ పాయసం అంటే మాత్రం చాలామంది ఎగబడి తింటారు. అంత రుచిగా ఉంటుంది సొరకాయ పాయసం.
సొరకాయ పాయసంని రెస్టారెంట్ప్ లో ఎక్కువ ధరకి అమ్ముతుంటారు. అయితే సొరకాయ పాయసంని రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సొరకాయ పాయసం తయారీకి ఏమేం పదార్థాలు కావాలి. దీని తయారీ విధానం ఎలా అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
Mutton Bone soup: ఎముకలకు బలం ఇచ్చే మటన్ సూప్.. సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలంటే?

సొరకాయ పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు
-సొరకాయ
-సగ్గుబియ్యం
-పాలు
-జీడిపప్పు
-బాదం
-నెయ్యి
-యాలకులు
-చక్కెర
సొరకాయ పాయసం తయారీ విధానం
-ముందుగా ఓ బౌల్ లో గోరు వెచ్చని నీళ్లు పోసి పావు కప్పు సగ్గుబియ్యం
వేసి నానబెట్టండి.
-ఇప్పుడు లేతగా ఉండే అరకేజీ ఉండే సొరకాయ తీసుకొని దాని పైన తొక్క అంతా తీసేయండి.
-ఇఫ్పుడు దానిపైన ఉండే పచ్చ భాగం మొత్తం కొబ్బరిని తురిమినట్లుగా తురమండి. లోపల తెల్లని దాన్ని తీసుకొని ఓ పక్క పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి అయ్యాక అందులో సొరకాయ తురుముని వేసి బాగా ఫ్రై చేయండి.
-కొంచెం డ్రై అయిన తర్వాత అందులో అరకప్పు నీళ్లు పోసి సాఫ్ట్ గా ఉడికించండి. నీళ్లు అన్నీ ఇనికిపోయేంతరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించిన తర్వాత పాన్ ని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద మరో పాన్ పెట్టి అందులో ఒక లీటర్ పాలు పోసి 3-4 నిమిషాలు బాగా మరిగించండి.
-ఇఫ్పుడు ఆ పాలల్లో ఉడికించిన సొరకాయ తురుము వేసి బాగా కలపండి. ఇప్పుడు అందులో నానబెట్టిన సగ్గు బియ్యం వేసి కలుపుకోండి.
-మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి 3-4 నిమిషాలు బాగా మరగనివ్వండి.
-ఈలోపు మిక్సీలో 6 బాదం,6 జీడిపప్పులు,3 యాలకులు వేసి బాగా మెత్తని పొడి అయ్యేలా గ్రైండ్ చేసుకోండి.
-పాలలో వేసిన సగ్గుబియ్యం 70 శాతం ఉడికిన తర్వాత అందులో ఈ పొడి వేసి కలపండి.
-ఇప్పుడు ఇందులో ముప్పావు కప్పు చక్కెర,సన్నగా తరిగిన కొన్ని డ్రై ఫ్రూట్ ని వేసి బాగా కలపండి.
-నాలుగు నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించండి.
-సగ్గుబియ్యం ఉడికి పాయం కొంచెం చిక్కబడితే చాలు. స్టవ్ ఆఫ్ చేసి టేస్టీ సొరకాయ పాయంని తింటే అదిరిపోతుదంతే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications