Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కొరియన్ డ్రామా స్టైల్ నూడుల్స్..మన ఇంట్లోనే, కేవలం 10 నిమిషాల్లో ఎలా చేసుకోవాలంటే..
గత కొన్నేళ్లుగా భారత్ లో కొరియన్ డ్రామాలు లేదా సిరీస్ లు చూసేవాళ్ల సంఖ్య భారీగా పెరిగింది. అయితే కొరియన్ మూవీస్ లేదా డ్రామాస్ చూస్తున్నప్పుడు అందులో వారు ఎంతో ఇష్టంగా తినే ఎర్రని, స్పైసీ నూడుల్స్ ను చూస్తుంటనే మనకు నోరూరిపోవడం గ్యారెంటీ.
అయితే కొరియన్ నూడిల్స్ రుచిని ఆస్వాదించడానికి కొరియన్ రెస్టారెంట్లకు లేదా ఖరీదైన రెస్టారెంట్లకు వెళ్లాల్సిన పనిలేదు లేదా వేల రూపాయలు పోసి విదేశీ నూడుల్స్ ప్యాకెట్లు కొనాల్సిన అవసరం లేదు. మీ ఇంటి వంటగదిలో దొరికే సాధారణ పదార్థాలతోనే, కేవలం 10 నిమిషాల్లో కొరియన్ స్పైసీ నూడుల్స్ తయారు చేసుకోవచ్చు. కొరియన్ స్టైల్ నూడుల్స్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
-నూడుల్స్ (ప్లెయిన్ లేదా మ్యాగీ వంటి ఇన్ స్టంట్ వి)
-వెల్లుల్లి రెబ్బలు
-చిల్లీ ఫ్లేక్స్
-సోయా సాస్
-వెనిగర్
-టమాటో కెచప్
-చక్కెర
-తెల్ల నువ్వులు
-వంట నూనె
-ఉల్లికాడలు (స్ప్రింగ్ ఆనియన్స్)
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో నీళ్లు మరిగించి అందులో నూడుల్స్ వేసి ఉడికించుకోవాలి. నూడుల్స్ మరీ మెత్తగా పేస్ట్ లా అయిపోకూడదు. అవి 90 శాతం ఉడికితే సరిపోతుంది. ఉడికిన తర్వాత నీటిని వడకట్టి పక్కన పెట్టుకోండి.
-ఒక వెడల్పాటి గిన్నెలో సన్నగా తరిగిన వెల్లుల్లి, చిల్లీ ఫ్లేక్స్, తెల్ల నువ్వులు, సోయా సాస్, టమోటా కెచప్, వెనిగర్, కొద్దిగా చక్కెర వేయండి. మీరు ఇన్‌స్టంట్ నూడుల్స్ వాడుతుంటే, అందులో ఉండే మసాలా ప్యాకెట్ కూడా ఇక్కడే వేయొచ్చు.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల నూనెను పొగలు వచ్చేంత వరకు వేడి చేయండి. ఆ వేడి వేడి నూనెను నేరుగా గిన్నెలో సిద్ధం చేసుకున్న మసాలా మిశ్రమంపై పోయాలి. చుయ్య్ మనే శబ్దం వస్తూ, వెల్లుల్లి, కారం వేగి అద్భుతమైన సువాసన వస్తుంది. దీనివల్ల పచ్చి వాసన పోయి సాస్ అద్భుతంగా తయారవుతుంది.
-ఇప్పుడు ఆ సాస్ మిశ్రమంలో ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడుల్స్ ను వేయండి. సాస్ మొత్తం నూడుల్స్ కి పట్టేలా బాగా కలపండి .
-చివరగా సన్నగా తరిగిన ఉల్లికాడలు, మరికొన్ని వేయించిన తెల్ల నువ్వులను పైన చల్లుకుంటే వేడి వేడి కొరియన్ నూడుల్స్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications