Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
Lassi: సమ్మర్ స్పెషల్ లస్సీ,సింపుల్‌గా చిటికెలో ఎలా చేసుకోవాలంటే?
సమ్మర్ వచ్చేస్తుంది గురూ. ఎండలు మండిపోవడం ఇప్పటి నుంచే మొదలయ్యాయి. ప్రజలందరూ కూల్ డ్రింక్స్, కూల్ వాటర్ తాగడం మొదలుపెట్టేశారు. ఈ ఎండలో అందరికీ ఎంతో ఇష్టమైన డ్రింక్ ఏదైనా ఉందంటే అది లస్సి. ఇది వేసవికాలంలో శరీరం చల్లగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అలాగే శరీర వేడిని తగ్గిస్తుంది. దీనిని తయారుచేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అందులో ఒకదాని గురించి ఈరోజు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
1 కప్పు పెరుగు
1/2 కప్పు నీరు
2 టేబుల్ స్పూన్లు చక్కెర
1/4 టీస్పూన్ యాలకుల పొడి
కొన్ని ఐస్ క్యూబ్స్

తయారీ విధానం:
ఒక బ్లెండర్లో పెరుగు, నీరు, చక్కెర మరియు యాలకుల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. అదంతా బాగా నునుపుగా లేదా క్రీమీగా అయ్యేంత వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఆ తరువాత అందులో ఐస్ క్యూబ్స్ వేసి మరోసారి బ్లెండ్ చేసుకోవాలి. ఆ తరువాత ఆ లస్సిని గ్లాసులో పోసుకోవాలి. దానిపై బాదం పలుకుల స్లైసెస్ చల్లేస్తే ఎంతో రుచికరమైన, ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే లస్సి సిద్ధమైనట్లే. మీరూ ఓసారి ట్రై చేయండి మరి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
