Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
Malai Kulfi: ఎండాకాలం కడుపులో చల్లగా ఉండాలంటే తప్పనిసరిగా ఇది తినాల్సిందే, ఎలా చేసుకోవాలంటే?
Recipes
oi-Banothu Praveen Kumar
Posted By: Banothu Praveen Kumar
ఎండాకాలం మొదలైంది. ప్రజలందరూ చల్లగా కడుపులో వేసుకోవాలని ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ తాగడం మొదలుపెట్టేశారు. అయితే మండే ఎండలో చాలా మంది ఇష్టంగా తినే వంటకం ఏదైనా ఉందంటే అది మలాయ్ కుల్ఫీ. ఎక్కడున్నా మరి దానికోసం వెళ్లి తింటూ ఉంటారు. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. దీంతో దీనిని తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. అయితే ఈ మలాయ్ కుల్ఫీని ఇంట్లోనే ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మలాయ్ కుల్ఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు
1 లీటరు పాలు
1/2 కప్పు చక్కెర
1/4 కప్పు పాలు పొడి (మిల్క్ పౌడర్)
1/4 కప్పు తాజా క్రీమ్
1/4 టీస్పూన్ యాలకుల పొడి
కొన్ని పిస్తా మరియు బాదం పలుకులు (గార్నిష్ కోసం)

తయారీ విధానం
- ముందుగా, పాలను ఒక మందపాటి గిన్నెలో పోసి సగం అయ్యే వరకు మరిగించండి. ఇది సుమారు 20-25 నిమిషాలు పడుతుంది. పాలు చిక్కబడ్డాక, చక్కెర వేసి, అది కరిగే వరకు కలపండి.
- వేరే గిన్నెలో పాలు పొడి మరియు తాజా క్రీమ్‌ను బాగా కలిపి ఉండలు లేకుండా చేయండి. ఈ మిశ్రమాన్ని మరిగించిన పాలలో వేసి బాగా కలపండి.
- ఆ తరువాత అందులో యాలకుల పొడి వేసి బాగా కలపండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లారనివ్వండి.
- మిశ్రమం పూర్తిగా చల్లారాక, కుల్ఫీ మొల్డ్స్‌లో లేదా చిన్న కప్పులలో పోయండి. పైన పిస్తా మరియు బాదం పలుకులతో గార్నిష్ చేయండి.
- మొల్డ్స్‌ను అల్యూమినియం ఫాయిల్‌తో కప్పి, ఫ్రీజర్‌లో కనీసం 6-8 గంటలు లేదా రాత్రంతా గడ్డ కట్టే వరకు ఉంచండి.
- కుల్ఫీ గడ్డ కట్టాక, వాటిని ఫ్రీజర్ నుండి బయటకు తీసి, కొద్దిసేపు నీటిలో ఉంచండి. తర్వాత మొల్డ్స్ నుండి కుల్ఫీని సులభంగా బయటకు తీయవచ్చు. ఆ తరువాత వాటిని ఆస్వాదించడమే.
Comments
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.
[ of 5 - Users]
English summary
How to make summer special malai kulfi at home recipe in telugu
Story first published: Friday, February 14, 2025, 14:50 [IST]
Other articles published on Feb 14, 2025



Click it and Unblock the Notifications