Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
అయిదు నిమిషాల్లో సూపర్ టేస్టీ ఎగ్ బుర్జీ.. సింపుల్‌గా ఎలా చేసుకోవాలంటే?
గుడ్డుతో నానా రకాల రెసిపీస్ చేస్తుంటారు. కేవలం బ్యాచిలర్స్ మాత్రమే కాదు, ఇంటిల్లిపాది కుటుంబ సభ్యులందరూ కలిసి తినే వంటకాల్లో గుడ్డు రెసిపీస్ కూడా ఒకటి. గుడ్డుతో చేసుకుని తినే రెసిపిల్లో ఎగ్ బుర్జీ కూడా ఒకటి. ఇది తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సులభం. కేవలం సులభమైన పద్దతిలో అయిదే అయిదు నిమిషాల్లో దీనిని చేసుకోవచ్చు. కానీ ఎలా చేసుకోవాలో తెలియదు. అందుకే ఈ స్టోరీలో ఎగ్ బుర్జీ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇలాంటి కోడిగుడ్డు కూర మీరు అసలే తిని ఉండరు, ముద్ద తింటే లాలాజలం ఊరాల్సిందే.. ఎలా చేసుకోవాలంటే
ఎగ్ బుర్జీ తయారీకి కావాల్సిన పదార్థాలు
కోడిగుడ్లు: 2-3
ఉల్లిపాయ: 1 (చిన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి: 1-2 (సన్నగా తరిగినవి)
నూనె: 2 టేబుల్ స్పూన్లు
పసుపు: చిటికెడు
కారం: రుచికి తగినంత
ఉప్పు: రుచికి తగినంత
కొత్తిమీర: కొద్దిగా (సన్నగా తరిగినది)

తయారుచేసే విధానం:
- ముందుగా ఒక గిన్నెలో గుడ్లను పగలగొట్టి, అందులో ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలపాలి.
- స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి చేయాలి.
- నూనె వేడయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
- తర్వాత కలిపి పెట్టుకున్న గుడ్డు మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.
- గుడ్డు బాగా ఉడికి, పొడిపొడిగా అయ్యేవరకు కలుపుతూ వేయించాలి.
- చివరగా కొత్తిమీర వేసి కలపాలి.
- అంతే వేడి వేడి ఎగ్ బుర్జీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications