Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
వంకాయతో ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? మన పూర్వీకులు ఇలానే చేసేవాళ్లు..రుచి కేక అంతే,ఎలా చేయాలంటే
వంకాయను సరిగ్గా వాడుకోవాలే కానీ దీంతో బోలెడు వెరైటీలు చేసి ఆస్వాదించవచ్చు. వంకాయను సరైన రీతిలో వండితే దీని టేప్ట్ మరే ఇతర కూరగాయకు ఉండదు. వంకాయ వెరైటీల్లో తందూరి వంకాయ ఒకటి. తందూరి వంకాయ ఒక ప్రసిద్ధ, రుచికరమైన వంటకం. ఇది కాల్చిన వంకాయను వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు, పెరుగుతో కలిపి తయారుచేస్తారు. తందూరి వంకాయ కేవలం రుచికరమైన వంటకమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. తందూరి వంకాయను ఇంట్లోనే ఈజీగా తారుచేయడం ఎలాగో ఇక్కడ చూడండి.
తందూరి వంకాయ తయారీకి కావలసిన పదార్థాలు
పెద్ద వంకాయలు - 2 (గుండ్రంగా లేదా పొడవుగా ఉన్నవి)
పెరుగు - 1 కప్పు
ఉప్పు- తగినంత
కొత్తిమీర- కొద్దిగా
నూనె - 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి - 1 టీ స్పూన్
జీలకర్ర పొడి - 1/2 టీ స్పూన్
పసుపు పొడి - 1/4 టీ స్పూన్
కారం పొడి - 1/2 టీ స్పూన్
గరం మసాలా - 1/4 టీ స్పూన్
చాట్ మసాలా - 1/2 టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్

తందూరి వంకాయ తయారీ విధానం
-ముందుగా వంకాయలను బాగా కడిగి వాటికి ఆయిల్ రాసి ఒక ఫోర్క్ లేదా కత్తితో అక్కడక్కడా రంధ్రాలు చేయాలి.
-ఇప్పుడు ఓవెన్ ను 200°C (400°F) కు ప్రీహీట్ చేయండి. వంకాయలను బేకింగ్ ట్రేలో ఉంచి అవి మెత్తగా మారే వరకు, కొద్దిగా నల్లబడే వరకు 30-40 నిమిషాలు కాల్చండి. మధ్యలో ఒకసారి తిప్పండి.
-నేరుగా గ్యాస్ స్టవ్ పై కూడా చేయవచ్చు. గ్యాస్ స్టవ్ మీద వంకాయలను ఉంచి, మంటను మీడియంలో ఉంచండి. వాటిని అన్ని వైపులా తిప్పుతూ నల్లబడి, లోపల మెత్తగా అయ్యే వరకు కాల్చండి. దీనికి 15-20 నిమిషాలు పట్టవచ్చు.
-వంకాయలు చల్లారిన తర్వాత వాటిపైన చర్మాన్ని తీసివేయండి. వంకాయ గుజ్జును తీసి ఓ గిన్నెలో వేసి బాగా మెత్తగా మాష్ చేయండి.
-తర్వాత ఒక గిన్నెలో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు పొడి, కారం పొడి, గరం మసాలా, చాట్ మసాలా, ఉప్పు వేసి బాగా కలపండి.
మామిడికాయ చికెన్ కర్రీ ఎప్పుడైనా తిన్నారా? 100 కోట్లు ఖర్చు చేసినా ఇలాంటిది దొరకదు,ఎలా చేయాలంటే
-తయారుచేసిన మసాలాను వంకాయ గుజ్జులో వేసి బాగా కలపండి. మసాలా వంకాయ గుజ్జుకు బాగా పట్టేలా కలపాలి.
-ఒక చిన్న పాన్‌లో నూనె వేడి చేసి అది కాస్త వేడెక్కాక మసాలా కలిపిన వంకాయ గుజ్జును వేసి 2-3 నిమిషాలు తక్కువ మంటపై ఉడికించండి. ఇది రుచిని మరింత పెంచుతుంది.
-తందూరి వంకాయను ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోండి. పైన కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయండి. దీనిని రోటీ, నాన్, పరాటా లేదా అన్నంతో సర్వ్ చేయవచ్చు. ఇది ఒక అద్భుతమైన సైడ్ డిష్ లేదా స్టార్టర్ గా ఉపయోగపడుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications