Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Mirapakaya Bajji మిరపకాయ బజ్జీలు టేస్ట్ గా తినాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఒక్కసారి ట్రై చెయ్యండి
Mirapakaya Bajji రాయలసీమ మసాలా మిర్చి బజ్జీ అంటే అందరూ లొట్టలు వేసుకుని తింటారు. నూనె లోపల వేయించిన పచ్చిమిర్చి, అదే సమయంలో పులుపు, కారం కలిపిన మసాల మిరపకాయ బజ్జీలుతింటే ఈ ప్రపంచాన్ని మరిచిపోతారు. అంతటి రుచికరమైన మిరపకాయ బజ్జీలు వాన పడుతున్న సమయంలో, లేదా సాయంత్రం పూట తింటే ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేము.
రాయలసీమతో పాట తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటకలో సాయంత్రం వేళల్లో అన్ని వీధి కూడళ్లలో బండిలపై, షాపుల్లో మసాలా మిర్చ్ బజ్జీలు అమ్మడం సర్వసాధారణం. మిరపకాయల బజ్జీలు వేయించిన అద్భుతమైన సువాసన అందరికీ ఆ బజ్జీలను రుచి చూడమని వెల్ కమ్ పంపుతున్నట్లు అవుతుంది. ఇక సాయంత్రం టీ, కాఫీ సిప్ చేస్తూ వేడి వేడి మిర్చి బజ్జీలు తినడం మాటల్లో చెప్పలేని అనుభవం కలిగిస్తుంది.

మిరపకాయ బజ్జీలు ఓ ప్రాంతానికే పరిమితం కాదు. మిర్చి బజ్జీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో, దక్షణి భారతదేశంతో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఫేమస్ అయ్యింది. రాయలసీమ జిల్లాల్లో, ముఖ్యంగా తిరుపతిలో, హైదరాబాద్ లో చేసే మిరపకాయ బజ్జీలకు, రాజమండ్రి, గుంటూరులో ప్రసిద్ధి చెందిన బజ్జీలకు ఏమాత్రం పోలిక ఉండదు. ప్రతిచోటా మిరపకాయ బజ్జీలు వెయ్యడానికి చెనిగి పిండి ఉపయోగిస్తారు, కానీ తయారీ విధానం పూర్తి భిన్నంగా ఉంటాయి.
మిర్చి బజ్జీ వంటకం గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన పని లేదని మీలో కొందరికి అనిపించవచ్చు. కానీ మీరు క్రింద ఇవ్వబడిన కొన్ని ముఖ్యమైన చిట్కాలను పాటిస్తే మీకు ఖచ్చితమైన, ప్రామాణికమైన మిరపకాయ బజ్జీలు వేసే చాన్స్ చిక్కుతుంది.

కావాల్సిన పదార్థాలు, తయారుచేయు విధానం:
• చాలా సున్నితంగా ఉండే చెనిగ పిండి ఉపయోగించకూడదు. మిర్చి బజ్జీ కోసం చెనిగపిండి కొద్దిగా రఫ్ గా ఉండాలి.
• కొంతమంది స్ఫుటమైన బజ్జీలను పొందడానికి చెనిగ పిండిలో బియ్యం పిండిని కలుపుతారు. మీకు నచ్చితే అలా కూడా చేసుకోవచ్చు.
• ఇడ్లీ పిండిలాగా మెత్తగా ఉండేలా చూసుకోవడానికి చెనిగిపిండిని అవసరమైన నీటితో కలపండి.
• వంట సోడా తగినంత వేసుకోవాలి. తరువాత చెనిగపిండిలో సోడా కలిసిపోయేలా కలపాలి.
• మీరు తప్పనిసరిగా ప్రత్యేక బజ్జీ మిరపకాయలను మాత్రమే మిరపకాయ బజ్జీలు వేసుకోవడానికి ఎంచుకోవాలి. ఆ రకం మిరపకాయలకు కావలసినంత ఘాటు ఉంటుంది.
• మిరపకాయను కత్తిరించండి. ప్రక్కన ఉన్న మిరపకాయకు చీలిక ఇవ్వాలి. మిరపకాయ విత్తనాలను జాగ్రత్తగా బయటకు తీయండి. దీనివల్ల ఘాటు కొద్దిగా తగ్గుతుంది.
• స్టఫింగ్ కోసం మందపాటి చింతపండు గుజ్జును ఉపయోగించండి. చింతపండు గుజ్జు నీళ్ళుగా ఉంటే ఆ మిరపకాయ బజ్జీలు పూర్తిగా చెడిపోతాయి. అలా చేస్తే నూనెలోకి ఆ నీళ్లు వస్తాయి. మొత్తం తయారీ చెడిపోతుంది.
• మిరపకాయల నుండి గింజలను బయటకు తీసే ముందు మీ చేతులకు కొద్దిగా నూనె రాసుకోండి. అది మీ చేతులను స్మార్టింగ్ నుండి కాపాడుతుంది.
• ఒక బేసన్‌లో ఉప్పు, వంట సోడా మరియు నీటిని జోడించిన తర్వాత, బాగా కాసేపు కలపండి. పిండి మిరపకాయలకు ఎంత ఎక్కువగా పడితే బజ్జీలు అంత బాగుంటాయి.
• మీరు బజ్జీలను వేయించడానికి ముందు నూనె చాలా వేడిగా ఉండనివ్వండి. కడాయి సైజు ప్రకారం 5 లేదా 7 బజ్జీలు వేయండి. బజ్జీలతో నూనె వేయకండి. బజ్జీలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. సాయంత్రం పూట ఇలా వేడివేడిగా ఇలా బజ్జీలు తింటే చాలా సూపర్ గా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications