Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
Mint rice: పొద్దున్నే వేడివేడిగా తింటే..అదిరిపోయే పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూడండి
రోజూ ఒకేరకమైన రైస్ ఐటమ్ తిని తిని బోర్ కొడుతుందా? కొత్తగా ఏదైనా టేస్టీ రైస్ ఐటమ్ తినాలనిపిస్తుందా? అయితే పుదీనా రైస్ ట్రై చేయండి. ఇది చాలా రుచికరమైన,ఆరోగ్యకరమైనది కూడా. పుదీనా తాజాదనం, అన్నం యొక్క రుచి ఒక ప్రత్యేకమైన కలయికను చేస్తాయి.
ఈ పుదీనా రైస్ రెసిపీ తయారు చేయడం చాలా సులభం. నలుగురికి సరిపడా పుదీనా రైస్ తయారీకి ఏయే పదార్థాలు కావాలి,తయారీ పద్దతిని ఇక్కడ చూసి తెలుసుకోండి.
పుదీనా రైస్ తయారీకి కావాల్సినవి
పచ్చిమిర్చి (సన్నగా తరిగినవి)-2
పుదీనా ఆకులు (సన్నగా తరిగినవి)-1 కప్పు
ఉల్లిపాయ (సన్నగా తరిగిన)-1
అల్లం (తురిమిన)-1 అంగుళం
దాల్చిన చెక్క-1 అంగుళం
బాస్మతి బియ్యం-1 కప్పు
లవంగాలు-3
బే ఆకు-1
జీలకర్ర-1 టీ స్పూన్
పసుపు-1/2 స్పూన్
కొత్తిమీర పొడి-1/2 టేబుల్ స్పూన్
ఎర్ర మిరప పొడి-1/4 స్పూన్
ఉప్పు-రుచికి తగినంత
నూనె-2 టేబుల్ స్పూన్లు
పుదీనా రైస్ తయారీ విధానం
-బియ్యాన్ని కడిగి నీటిలో 30 నిమిషాలు నానబెట్టాలి.
-గిన్నెలో నీటిని వేడి చేసి అందులో నానబెట్టిన బియ్యాన్ని వేసి
మెత్తగా ఉడికించాలి.
-వండిన అన్నంని స్టయినర్ లో తీసి చల్లారనివ్వాలి.
-బాండీలో నూనె వేడి చేసి జీలకర్ర,లవంగాలు,దాల్చిన చెక్క, బే ఆకులను
వేసి వేయించాలి.
-ఇప్పుడు ఉల్లిపాయ వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
-తర్వాత పచ్చిమిర్చి,అల్లం,పసుపు,ధనియాల పొడి,ఎర్ర కారం వేసి బాగా
కలపాలి.
-ఇందులో ఉడికించిన అన్నం,పుదీనా వేసి బాగా కలపాలి.
-రుచికి అనుగుణంగా ఉప్పు వేసి కలపాలి.
-పొయ్యి ఆపేసి ఒక మూతతో కప్పి 5 నిమిషాలు పక్కన పెట్టండి.వేడి వేడి
పుదీనా రైస్ రెడీ.
-పెరుగు,రైతా లేదా ఊరగాయతో వేడి పుదీనా అన్నాన్ని కలుపుకొని తింటే ఆహా
ఏమి రుచి అంటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












