Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
ఇడ్లీ,దోశ,చపాతీ,బిర్యానీ ఎందులోకైనా అదిరిపోయే కుర్మా..ఈ పద్ధతిలో చేశారంటే సూపరో సూపర్
ఇడ్లీ,దోశ, పూరీల్లోకి చట్నీకి బదులుగా కుర్మాతో తింటే టేస్ట్ అదిరిపోతుంది. కుర్మాని అనేక రకాలుగా తయారుచేస్తుంటారు. చికెన్ కుర్మా,మటన్ కుర్మాతో పాటు వెజ్ కుర్మా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కూరగాయలు, మసాలా దినుసులు,కొబ్బరి పాలతో తయారు చేయబడే కుర్మా రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యకరమైనది కూడా. దీనిని ఇడ్లీ,దోశ,చపాతీ,పూరీ, రోటీ, నాన్, అన్నం లేదా బిర్యానీతో కూడా తినవచ్చు. వెజ్ కుర్మాలో అనేక రకాల కూరగాయలు ఉంటాయి కాబట్టి ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. వెజ్ కుర్మాని ఇంట్లోనే టేస్టీగా తయారుచేయడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
వెజ్ కుర్మా తయారీకి కావలసిన పదార్థాలు
బంగాళాదుంప: 1 కప్పు
బీన్స్: 1/2 కప్పు
క్యారెట్: 1 కప్పు
బఠానీలు: 1/2 కప్పు
కాలీఫ్లవర్: 1/2 కప్పు
టమోటా: 1
పచ్చిమిర్చి: 2
ఉల్లిపాయ: 1
నూనె: 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు: 1/2 టీస్పూన్
కారం: 1 టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
కొబ్బరి పాలు: 1 కప్పు
జీడిపప్పు పేస్ట్: 1/4 కప్పు
గరం మసాలా: 1/2 టీస్పూన్
కొత్తిమీర: కొద్దిగా
వెజ్ కుర్మా తయారీ విధానం
-క్యారెట్,బంగాళదుంప, కాలీఫ్లవర్, బీన్స్ ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
-తర్వాత ఒక మందపాటి గిన్నెలో ఆయిల్ వేడి చేశాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్,సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
-తర్వాత అందులో టమోటా ముక్కలు వేసి మెత్తబడే వరకు ఉడికించి అందులో పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి.
-తర్వాత అందులో కూరగాయల ముక్కలు వేసి బాగా కలిపి ఇందులో కొబ్బరి పాలు, జీడిపప్పు పేస్ట్ వేసి మూత పెట్టి కూరగాయలు మెత్తబడే వరకు ఉడికించాలి.
-తర్వాత అందులో గరం మసాలా, కొత్తిమీర వేసి కలపాలి. అంతే వెజ్ కుర్మా రెడీ.
ఆంధ్రా ఫేమస్ బిర్యానీ ఇదే..దీన్ని తినకుంటే జీవితమే వేస్ట్!
వెజ్ కుర్మా వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఇవే
వెజ్ కుర్మా రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకం. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వెజ్ కుర్మాలో విటమిన్లు, ఖనిజాలు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వెజ్ కుర్మాలో క్యారెట్, బంగాళాదుంప, బీన్స్, బఠానీలు, కాలీఫ్లవర్ వంటి వివిధ రకాల కూరగాయలు వాడతారు..ఈ కూరగాయలలో విటమిన్లు A, C, K, B, ఖనిజాలు పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీర బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.
వెజ్ కుర్మాలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి..ఇవి క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. ఇది చర్మం, జుట్టు ఆరోగ్యానికి మంచిది. వెజ్ కుర్మాలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది, ఇది కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి మంచిది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







