Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మన పూర్వీకులు తిన్నది ఇదే..అమోఘం,అద్భుతం అంటూ వేళ్లు కూడా నాకేస్తారు..ఎలా చేసుకోవాలంటే
ప్రకృతి ప్రసాదాల్లో తాటికాయలు ఒకటి. సమ్మర్ లో లభించే తాటిముంజలు అంటే ఎగబడి తినేటోళ్లు బోలెడు మంది. అయితే తాటిచెట్టు నుంచి దింపని కాయలు పీసుతాటికాయలుగా మారి రాలిపోతుంటాయి. అయితే ఈ పీసు తాటికాయలతో అనేక రకాల వంటకాలను తయారుచేస్తుంటారు. పీసు తాటికాయలను కొందరు కాల్చుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది,నేరుగా అలాగే తిన్నా కూడా అద్భుతమే. దీంతో ఇడ్లీ,తాటి గారెలు వంటి అనేక రకాల వెరైటీలు తయారుచేసుకోవచ్చు. అయితే మీరెప్పుడైనా తాటి రోట్టె తిన్నారా? మైమరిపించే రుచితో పాటు ఆరోగ్యానికి కూడా బోలెడు మేలు చేసే తాటి రొట్టెను ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తాటి రొట్టె తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం నూక
-పీసు తాటికాయలు
-ఆయిల్
-బెల్లం

తాటి రొట్టె తయారీ విధానం
-ముందుగా ఓ పెద్ద గిన్నె తీసుకోండి. ఇందులో 2 కప్పుల బియ్యం నూక వేసి కొంచెం కొంచెంగా నీల్లు పోసుకుంటూ నూకను తడిసేలా తడిపిపెట్టుకోవాలి. నీళ్లు ఎక్కువ వేయకూడదు..నూక తడిసేలా ఉంటే సరిపోతుంది.
-తడుపుకున్న నూకను అరగంట సేపు పక్కనపెట్టి వదిలేయండి
-ఇప్పుడు రెండు పీచు తాటికాయలను తీసుకొని వాటి పైన ఉండే చెక్కు, తొక్క అంతా తీసేసి పీసుతో నిండిన టెంకలను ఓ ప్లేట్ లో పెట్టుకోండి.
-తర్వాత డీప్ ఫ్రైలో కలబెట్టే బుట్ట గరిటమీద పీచు ఉన్న తాటి టెంకెలను పెట్టి తరుముకున్నట్లు చేయాలి. బుట్ట గరిటతో తీసుకోవడం వల్ల పీచు రాకుండా నీట్ గా తాటి గుజ్జు వచ్చేస్తుంది.
-తురుముకోగా వచ్చిన తాటి గుజ్జును పక్కన ఉంచిన నూకలో వేసేయండి. ఇందులో ఒకటిన్నర కప్పు ముక్కలు చేసి మెత్తగా దంచిన బెల్లం కూడా వేసి మొత్తం అన్నీ కలిసేలా చేత్తో బాగా కలుపుకోండి.
-నానిన నూక,తాటి గుజ్జు,బెల్లం మొత్తం బాగా కలిసేలా కలుపుకున్నాక తీపి చెక్ చేసుకొని కావాలనుకుంటే ఇంకొంచెం బెల్లం వేసి కలుపుకోండి.
-తర్వాత స్టవ్ మీద మందపాటి పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చెయ్యాలి.
-పాన్ లో ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కలిపిన పిండి వేసి రొట్టె ఆకారంలో అడ్జెస్ట్ చేయండి. దాని పైన వచ్చే నూనెను రొట్టెమీదకు సమానంగా లాక్కోండి.
-మంటను తగ్గించి మూతపెట్టి ఉడకనివ్వాలి. చుట్టూ బ్రౌన్ కలర్ వస్తే
మంచిగా కాలిందని అర్థం. అప్పుడు దానిని తిప్పి రెండోవైపు కూడా
కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా కాలనివ్వాలి. అంతే తాటి రొట్టె రెడీ.
స్టవ్ ఆప్ చేసి రొట్టెను చల్లారనిచ్చి మీకు నచ్చిన షేపులో ముక్కులగా
కట్ చేసుకొని తింటే ఆ మజానే వేరే లెవల్లో ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications