Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
తెలంగాణ స్టైల్ బగారా బువ్వ..ప్లేటు కూడా నాకేసేంత రుచి,ఎలా చేసుకోవాలంటే
తెలంగాణలో ఏ ఫంక్షన్ అయినా సరే బగారా బువ్వ ఉండి తీరాల్సిందే. అది చావుది అయినా, పెళ్లి అయినా లేదా బర్త్ డే పంక్షన్ అయినా ఏదైనా సరే తెలంగాణలో పంక్షన్ అంటే బగారా రైస్ ఉంటది. దేశంలోని మరే ఇతర ప్రాంతంలో లేని విధంగా తెలంగాణ బువ్వ టేస్ట్ ఉంటుంది. తెలంగాణలో చాలా ప్రత్యేకంగా బగారా బువ్వ తయారుచేస్తారు. qఅసలు సిసలు తెలంగాణ స్టైల్ బగారా బువ్వ తయారుచేయడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
బగారా బువ్వ తయారీకి కావలసిన పదార్థాలు
ఆయిల్-2 టేబుల్ స్పూన్లు
నెయ్యి-2 టేబుల్ స్పూన్లు
షాజీరా- 1 టేబుల్ స్పూన్
దాల్చిన చెక్క-2 ఇంచులు
స్టార్ అనాస-1 పువ్వు
నల్ల యాలకలు- 1
పచ్చ యాలకలు- 5-6
బిర్యానీ ఆకులు-2
నల్ల మిరియాలు- కొద్దిగా
జాపత్రి-కొద్దిగా
పచ్చిమిర్చి-2
ఉల్లిపాయ-1
అల్లంవెల్లుల్లి పేస్ట్-1 టేబుల్ స్పూన్
నానబెట్టిన బాస్మతి బియ్యం-2 కప్పులు
పుదీనా-కొద్దిగా
ఉప్పు-కొంచెం
హాట్ వాటర్- 2.5కప్పులు
కొత్తిమీర-కొద్దిగా
లవంగ మొగ్గలు-5-6

బగారా బువ్వ తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి నూనె, నెయ్యి వేడి చెయ్యాలి.
-తర్వాత అందులో దాల్చినచెక్క,షాజీరా,జాపత్రి, నల్ల మిరియాలు. పచ్చ యలకలు,నల్ల యలకలు, బిర్యానీ ఆకులు,దాల్చిన చెక్క,స్టార్ అనాస,లవంగ మొగ్గలు వేసి వేయించాలి.
-తర్వాత అందులో ఉల్లిపాయ చీలికలు, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, ఉప్పు వేసి ఉల్లిపాయలు బంగారు గోధుమ రంగులోకి వచ్చేదాకా వేయించి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి.
-తర్వాత నానబెట్టిన 2 కప్పుల బాస్మతి బియ్యం,కొత్తిమీర తరుగు కొంచెం ఎక్కువగానే వేసి నెమ్మదిగా 2 నిమిషాలు వేయించండి.
-తర్వాత అందులో 1 కప్పు బియ్యానికి కప్పుంబావు నీళ్లు చొప్పున పోసి మూతపెట్టి హై ప్లేమ్ మీద 2 విజిల్స్ రానివ్వండి.
-స్టీమ్ పోయేంతవరకు వేచి ఉండండి. ఆ తర్వాత ప్లేట్ లో పెట్టుకొని తింటే స్వర్గమే.
ఇడ్తీ,దోశ,బోండా,పూరీ వదిలేయండి..హెల్దీ గుజరాత్ స్టైల్ 'దూది నా ముటియా' ట్రై చేయండి,ఎలా చేయాలంటే
బగారా బువ్వ ప్రయోజనాలు
బగారా బువ్వ కేవలం రుచికరమైనది మాత్రమే కాదండోయ్..ఆరోగ్యకరమైనది కూడా. ఇందులో ఉపయోగించే బాస్మతి బియ్యం తేలికగా జీర్ణమవుతుంది. మంచి కార్బోహైడ్రేట్ల మూలం. తక్కువ గ్లెసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బగారా బువ్వ తయారీలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి, జీర్ణక్రియకు సహాయపడతాయి. కొన్ని మసాలాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో,గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి.
ఇది గుర్తుంచుకోండి
బగారా బువ్వలో నెయ్యి లేదా నూనె ఎక్కువగా ఉపయోగిస్తే కేలరీలు, కొవ్వు శాతం పెరుగుతుంది. ఎక్కువ ఉప్పు ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది కాదు. దీనిని సమతుల్య ఆహారంలో భాగంగా మితంగా తీసుకోవడం మంచిది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications