Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
చపాతీలు రుచిగా.. మెత్తగా పూరీల్లా ఉబ్బాలంటే ఏం చేయాలి? సింపుల్ టిక్స్ ..!
దయం అల్పాహారంగా దోసె, ఇడ్లీతో పాటు చపాతీ కూడా తయారుచేసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన టిఫిన్ ను ఇష్టపడతారు. దోసె, ఇడ్లీ సరే, చపాతీ తింటే శరీరం వేడక్కుతుందని, నీళ్లు ఎక్కువగా తాగాలనిపిస్తుందని అంటారు. అయితే చపాతీ మెత్తగా మంచి కాంబినేషన్ ఉంటే సరే లేదంటే తినడానికి అంత ఇష్టం ఉండదని చాలా మంది ఫిర్యాదు చేస్తుంటారు.
ఫిర్యాదుల సంగతి పక్కన పెడితే ఉదయం అల్పాహారంలో చపాతీ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే గోధుమల్లో లో గ్లిజమిక్స్ ఇండెక్స్, ఫైబర్ అధికంగా ఉంటుంది. సులభంగా జీర్ణం అవుతుంది. షుగర్ లెవల్స్ పెరగవు. కేలరీలు తక్కువ ఉంటాయి కాబట్టి సులభంగా బరువు తగ్గిస్తుంది. అయితే చపాతీ పిండిని ఆరోగ్యకరంగా తినడానికి రుచిగా, సాప్ట్ గా ఎలా చేయాలా చాలా మందికి తెలియదు.

కొంత మంది చపాతీలు చేస్తే పూరీల్లా ఉబ్బుతాయి. అలా మనకెందుకు రావు అనుకుంటుంటా. మీరు కూడా అలాంటి చపాతీలు తయారుచేయడానికి కొన్ని సింపుల్ చిట్కాలు ట్రై చేస్తే చాలు. పిండి కలపడంలో పొరపాటుచేస్తే పిండిమొత్తం పాడవుతుంది. చపాతీలు సరిగా రావు, గట్టిగా తయారవుతాయి. మరి దీని కోసం సరిగ్గా పిండిని ఎలా తయారు చేయాలి? చపాతీలు మెత్తగా పూరీల్లా ఉబ్బేలా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
టేస్టీగా మరియు సాఫ్ట్ గా చపాతీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు మరియు చపాతీ తయారు చేయడానికి ఉత్తమమైన మార్గం ఏది? తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది? పిండి తయారు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
చపాతీ మొత్తగా చేయడానికి కావలసిన పదార్థాలు:
గోధుమ పిండి - 1 కప్పు
రుచికి సరిపడా ఉప్పు
పిండిలో కలపడానికి నీరు
కొద్దిగా నూనె
చపాతీ మొత్తగా ఎలా చేయాలి?
1. ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని ఒక వెడల్పాటి గిన్నెలో వేసి ఉప్పు
వేసి కలపాలి. ఈ పిండి వీలైనంత సాప్ట్ గా ఉండాలి. ఇప్పుడు ఒక కప్పు
పిండిలో వేడి నీళ్ళు వేసి కలపండి. కొద్దికొద్దిగా వేడి నీళ్ళు పోసి
పిండి కలపాలి. మీ చేతులను నీటిలో ముంచి, పిండిని కలపండి.
2. చపాతీ పిండి చాలా స్మూత్ గా అయ్యే వరకు మెత్తగా కలుపుకోవాలి. ఈ
పిండిని మరో గిన్నెలోకి వేసి 30 నిమిషాలు మూతపెట్టి పక్కన
పెట్టాలి.
3. అరగంట తర్వాత మళ్లీ అదే పిండిని మరో 1 నిమిషం పాటు కలపాలి. ఆ
తర్వాత మళ్లీ చపాతీ చేయడానికి కావలసిన సైజులో నిమ్మపండంత సైజ్ పిండి
తీసుకుని ఉండలు చుట్టుకోవాలి.
4. చపాతీలు మీకు కావల్సినన్ని ఉండలు చుట్టుకున్న తర్వాత, చపాతీ పీటమీద
చపాతీలను మీకు కావాల్సిన సైజ్ లో రుద్దుకోవాలి.
5 అలా చపాతీలు 5 లేదా 6 రుద్దుకున్న తర్వాత స్టౌ మీ గ్రిల్ సెట్టి,
ఒకనిముషం కాల్చుకోవాలి నూనె అస్సలు వాడకూడదు. ఇలా ఒక్కొక్కటి గ్రిల్
మీద కాల్చుకుంటూ..మరో స్టౌ మీద పాన్ పెట్టి, గ్రీల్ మీద కాల్చిన
చపాతీని పాన్ మీద వేసి తక్కవు మంట మీద కాల్చుకోవాలి. ఇలా
కాల్చేటప్పుడు రెండు చుక్కల నూనెను వేసుకుంటూ రెండు వైపులా
కాల్చుకోవాలి.
6. లేదా మరో పద్దతిలో చపాతీని రెండు వైపులా కొద్దిగా వేడి చేసి పెనం
మీద పెట్టి నేరుగా స్టవ్‌పై గ్రిల్ మీ పెట్టాలి. ఈ
సందర్భంలో, రెండు వైపులా వెచ్చగా ఉంచండి. ఈ సమయంలో మంట పెంచండి, ఈ
చపాతీ ఉబ్బుతుంది. ముందుగా పాన్ లో ఉడికిన తర్వాత పెనం మీద ఉంచి వేడి
చేయాలి, అప్పుడే అది ఉబ్బి దూదిలా మెత్తగా మారుతుంది.
7. అంతే మీకు నచ్చిన మెత్తని చపాతీ రెడీ. ఏదైనా గ్రేవీ, వేపుడు లేదా
చట్నీతో సర్వ్ చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications