Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
ఇంట్లో ఏమీ లేకున్నా ఒక్క టమాటో ఉంటే చాలు.. అదిరిపోయే కుర్మా చేసుకోవచ్చు, ఎలా అంటే?
కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఎలాంటి వస్తువులు లేనప్పుడు పచ్చి కారంతో అన్నం తింటూ ఉంటాము. ఆ సందర్భంలో అవి కూడా రుచిగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని చెప్పుకోవచ్చు. అలాగే చాలా మంది బ్యాచిలర్స్కి వంట ఎలా చేసుకోవాలో కూడా తెలియదు. దీని కారణంగా వారు బయటి నుంచి ఆహారం తీసుకొచ్చి తిని.. అనారోగ్యం బారిన పడుతుంటారు. అలాగే డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు.
అలాంటి వారికోసమే ఓ చక్కటి రెసిపీ తీసుకొచ్చాను. ఇది చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇంట్లో కేవలం ఒక్క టమాటో ఉంటే సరిపోతుంది. అదే టమాటో కుర్మా రెసిపీ. దీని రుచి అమోఘంగా ఉంటుంది. అలాగే చేసుకోవడం కూడా అత్యంత సులభమైన విషయం. వంట వండుకోవడం రాని వ్యక్తులు కూడా దీనిని సులభంగా చేసుకుంటారు. ఆ రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటి? అనేది ఈ స్టోరీలో వివరించాము.. చూసి మీరూ ట్రై చేయండి.

టమాటో కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి?
టొమాటోలు - 2 (సన్నగా తరిగినవి)
ఉల్లిపాయ - 1 (తరిగినది)
కొబ్బరి తురుము - 1/4 కప్పు
పచ్చిమిర్చి - 2 లేదా 3 (చీలికలుగా)
అల్లం - అరకప్పు అంగుళం (తురిమినది)
వెల్లుల్లి - 2 రెబ్బలు (తరిగినవి)
ఆవాలు - 1/2 టీస్పూన్
జీలకర్ర - 1/2 టీస్పూన్
పసుపు - 1/4 టీస్పూన్
కారం - 1/2 టీస్పూన్
గరం మసాలా - 1/2 టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నూనె - అవసరమైతే
కొత్తిమీర - గుప్పెడు
సమ్మర్లో పిల్లలు ఎక్కువగా ఇష్టపడే స్నాక్స్.. ఇంట్లోనే సింపుల్‌గా చేసి పెడితే లొట్టలేసుకుని తింటారు!
టమాటో కుర్మా తయారీ విధానం
ఈ టమాటో కుర్మా తయారు చేసుకోవడం చాలా సులభం. ఇందుకోసం ముందుగా ఒక పాన్ తీసుకోవాలి. దానిని స్టవ్ మీద పెట్టి, అందులో నూనె వేసుకోవాలి. ఇప్పుడు బాగా వేడెక్కిన నూనెలో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఆ ఆవాలు, జీలకర్ర చిటపటాలాడేలా వాటిని వేయించుకోవాలి.
ఇప్పుడు ఆ మిశ్రమంలో మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే ఆ ఉల్లిపాయలు లేత బంగారు వర్ణంలోకి వచ్చేంత వరకు వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక.. అందులో అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. ఆ తరువాత వాటి నుంచి పచ్చి పచ్చి వాసన అంతా బయటికి వెళ్లేలా వేయించుకోవాలి. తరువాత అందులో తరిగిన టొమాటోలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసుకోవాలి. అవన్నీ బాగా మెత్తబడే వరకు బాగా ఉడికించుకోవాలి.
ఇప్పుడు అందులో పసుపు, కారం, గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తరువాత అందులో కొబ్బరి తురుము కూడా వేసుకొని కలుపుకొని, మరో రెండు లేదా మూడు నిమిషాల పాటు కలుపుకొని ఉడికించుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీరు వేసి, కుర్మా సాస్‌లా తయారయ్యేలా చెయ్యండి. ఆ తరువాత దానిపై కొత్తిమీర చల్లి అలంకరించండి. అంతే ఎంతో రుచికరమైన వేడి వేడి టమాటో కుర్మా సిద్ధమైనట్లే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications