Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
పల్లి చట్నీ కాదు, ఈసారి టమాటో పల్లి చట్నీ ట్రై చేయండి.. రుచి సూపర్, ఎలా చేసుకోవాలంటే?
ప్రతి ఒక్కరి ఇంట్లో ఉదయాన్నే టిఫిన్ ఉంటుంది. ఇడ్లీ, దోశ వంటివి చేసుకుంటుంటారు. ఈ టిఫిన్‌లో ఎదో ఒక చట్నీ చేసుకుంటుంటారు. మంచి చట్నీ ఉంటేనే ఆ టిఫిన్ అనేది రుచి కరంగా ఉంటుంది. తిన్న ఒక్కో ముద్దా అద్భుతమైన రుచితో ఉంటుంది. ముద్ద ముద్దలో మజా ఉంటుంది. చాలా మందికి టిఫిన్‌లో ఇష్టమైన చట్నీ ఏదైనా ఉందంటే అది టమాటో పల్లి చట్నీ. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. తిన్న టిఫిన్ కూడా అమోఘంగా ఉంటుంది. అయితే చాలా మందికి ఈ పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో తెలియదు. అందుకే ఆ చట్నీ చేయడంలో అప్పుడప్పుడు విఫలమవుతుంటాయి. అందుకే ఈ స్టోరీలో పర్ఫెక్ట్ టమాటో పల్లి చట్నీ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది తెలుసుకుందాం.
పల్లి చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు:
పల్లీలు - 2 కప్పులు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిరపకాయలు - 4 నుండి 5
టమాటాలు - 2 (సన్నగా తరిగినవి)
ఉప్పు - రుచికి తగినంత
చింతపండు - అర నిమ్మకాయ పరిమాణం
బెల్లం - చిన్న ముక్క
తాలింపు కోసం:
ఆవాలు - ¼ టీస్పూన్
జీలకర్ర - ½ టీస్పూన్
శనగపప్పు - ½ టీస్పూన్
ఎండు మిరపకాయలు - 2 లేదా 3
కరివేపాకు - రెండు రెబ్బలు
అలేఖ్య చిట్టి పికిల్స్ చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసా?.. ఇలా చేస్తే మీ కెరీర్‌లో సెట్ అయినట్లే!
పల్లి చట్నీ తయారీ విధానం:
ముందుగా పల్లీలు వేయించండి
ముందుగా ఓ బాణలిలో పల్లీలు వేసి మీడియం మంట మీద స్వల్పంగా వేయించండి. పల్లీలు బాగా గోధుమ రంగులోకి మారేవరకు వేయించి, తరువాత చల్లారనివ్వండి. పొట్టు తీయాల్సిన అవసరం లేదు.
మసాలా మిశ్రమం తయారీ
ఇప్పుడు అదే బాణలిలో నూనె వేసి వేడి చేయండి. వేడి అయ్యాక పచ్చిమిరపకాయలను మధ్యలో చీల్చి వేయండి. వెంటనే తరిగిన టమాటాలు కూడా వేసి కలపండి.
చింతపండు, బెల్లం వేసి వేయించండి
ఇప్పుడు టమాటాల మిశ్రమం కొద్దిగా కరగడం ప్రారంభించిన తరువాత చింతపండు ముక్క, బెల్లం ముక్క వేసి మరిగించండి. చివరగా కొద్దిగా ఉప్పు వేసి కలపండి.
అన్ని పదార్థాలు మిక్స్ చేయడం
ఇప్పుడు వేయించిన పల్లీలు, టమాటో మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తగా రుబ్బుకోండి. రుబ్బిన తర్వాత అవసరమైతే ఉప్పు సవరించండి.
తాలింపు తీయడం
ఓ చిన్న బాణలిలో కొద్దిగా నూనె వేసి వేడి చేయండి. అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక శనగపప్పు, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి వేగించండి.
చట్నీలో తాలింపు కలపడం
రెడీ అయిన తాలింపును మిక్సీలో చేసిన చట్నీలో వేసి బాగా కలపండి.
చిట్కా:
ఈ చట్నీని ఐడ్లీ, దోస, ఉప్మా, వంటి అన్ని టిఫిన్ రకాలకూ చక్కగా సరిపోతుంది. ఎక్కువగా చేస్తే ఫ్రిజ్‌లో 2 రోజుల వరకు నిల్వ ఉంచవచ్చు. అయితే నూనె తాలింపు ఎక్కువగా వాడితే నిల్వ ఎక్కువ కాలం ఉంటుంది. సాధారణ పల్లీ చట్నీకి కొంత తేడా ఉంటుంది. కానీ రుచిలో అసలైన గ్లామర్‌ను తెచ్చే ఈ టమాటో పల్లీ చట్నీ మీకు, మీ కుటుంబానికి ఖచ్చితంగా నచ్చుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ.. ఒక్కసారి రుచి చూసారంటే మళ్లీ మళ్లీ అడుగుతారు!
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












