Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
నోరూరించే నిమ్మకాయ-ఎండుమిర్చి పచ్చడి..ఆకలి లేకపోయినా లాగించేస్తారు!
భారతీయ భోజనంలో ఎన్ని రకాల కూరలు, సలాడ్లు, సూప్ లు ఉన్నప్పటికీ.. చివరన కొద్దిగా పచ్చడి లేకపోతే ఆ భోజనం అసంపూర్ణంగానే అనిపిస్తుంది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి, ఒక స్పూన్ పచ్చడి వేసుకుని తింటే ఆ రుచే వేరు. సాధారణ వంటకాలకు కూడా అద్భుతమైన రుచిని అద్దే శక్తి పచ్చళ్లకు ఉంది. అలాంటి కోవకే చెందుతుంది ఈ నిమ్మకాయ-ఎండుమిర్చి చట్నీ.
కేవలం పులుపు, కారం మాత్రమే కాకుండా.. తీపి కూడా కలగలిసి ఉండే ఈ చట్నీని ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదలరు. ఇది పల్లెటూరి శైలిలో చేసే ఒక ప్రత్యేకమైన వంటకం. పరాఠా నుంచి కిచిడీ వరకు, సమోసా నుంచి పెరుగన్నం వరకు.. దేనితో తిన్నా దీని కాంబినేషన్ అదిరిపోతుంది. నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్దీ, టేస్టీ చట్నీ ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
నిమ్మకాయలు - 2
ఎండు మిరపకాయలు - 5
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 3
అల్లం - చిన్న ముక్క
బెల్లం లేదా పంచదార - 1 టేబుల్ స్పూన్
నల్ల ఉప్పు- 1 టేబుల్ స్పూన్
సాధారణ ఉప్పు - రుచికి సరిపడా
ఆవ నూనె - 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
-ముందుగా నిమ్మకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నిమ్మకాయలోని గింజలను పూర్తిగా తొలగించాలి. ఒక్క గింజ ఉన్నా చట్నీ చేదుగా మారిపోతుంది.
-స్టవ్ వెలిగించి ఒక చిన్న పాన్‌ను వేడి చేయండి. అందులో జీలకర్ర, ఎండు మిరపకాయలను వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత మిక్సీ గిన్నెలో కట్ చేసిన నిమ్మకాయ ముక్కలు, వేయించిన మిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, సాధారణ ఉప్పు, నల్ల ఉప్పు,ఒక స్పూన్ బెల్లం వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
-చట్నీ రుబ్బిన తర్వాత, ఒక చిన్న గిన్నెలో రెండు స్పూన్ల ఆవ నూనెను వేడి చేయండి. నూనె వేడెక్కాక స్టవ్ ఆపేసి అది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ చట్నీలో కలపండి. దీంతో చట్నీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మరియు రుచి రెట్టింపు అవుతుంది.
-ఆలు పరాఠా, గోబీ పరాఠా లేదా చపాతీతో నంచుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. వేడి కిచిడీ, పప్పు అన్నం లేదా ముఖ్యంగా పెరుగన్నంలోకి ఈ చట్నీని నంజుకుంటే ఆ రుచిని మాటల్లో వర్ణించలేం. సాయంత్రం వేళ సమోసాలు, బజ్జీలు లేదా పకోడీలతో దీన్ని డిప్ గా కూడా వాడవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications