Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Ugadi pachadi: శాస్త్రీయమైన పద్దతిలో..నిజమైన ఉగాది పచ్చడిని ఎలా చేయాలంటే..
ఉగాది అనే పేరు వినగానే మన మనసులో మొదటగా గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడే. షడ్రుచుల సమ్మేళనం అంటే తీపి,ఉప్పు,కారం,వగరు,పులుపు,చేదుతో కూడిన ఉగాది పచ్చడిని ఉగాది రోజున తిని తీరాల్సిందే అని మన పెద్దలు చెబుతుంటారు. ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు జీవితంలోని ఆరు భిన్నమైన అనుభవాలకు చిహ్నం. తెలుగువారికి ఉగాది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఒక కొత్త ఆరంభం కూడా. తెలుగువారికి నూతన సంవత్సరం ఉగాది నుంచే ప్రారంభం అవుతుంది.
ఈ ఏడాది ఉగాది మార్చి 30న జరుపుకుంటారు. ఈ ఏడాది ఉగాది నుంచి వచ్చే కొత్త సంవత్సరాన్ని శ్రీ విశ్వావసు నామ సంవత్సరంగా పిలుస్తారు. ఉగాది రోజున తెలుగువారి ఇళ్లలో చేసే పచ్చడి కేవలం రుచికరమైన వంటకం మాత్రమే కాదు..ఇందులో అనేక ఆరోగ్య,సాంస్కృతిక ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు జీవితంలోని వివిధ అనుభవాలను సూచిస్తాయి, వాటిని స్వీకరించడానికి మనల్ని మానసికంగా సిద్ధం చేస్తాయి. ఈ ఆరు రుచులను కలపడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల అనుభవాలను సమానంగా స్వీకరించాలనే భావన కలుగుతుంది.

కష్టాలు, సుఖాలు రెండూ జీవితంలో భాగమేనని ఉగాది పచ్చడి గుర్తు చేస్తుంది. అయితే ప్రస్తుతం ఉగాది పచ్చడి చేసే తీరుతెన్నులు మారిపోయాయి. ఒక్కొక్కరిది ఒక్కో తీరులా ఉంటుంది. అయితే శాస్త్రీయమైన పద్దతిలో నిజమైన ఉగాది పచ్చడిని ఎలా తయారుచేయాలో ఇక్కడ చూడండి.
ఉగాది పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు
-మామిడికాయ
-చింతపండు
-ఉప్పు
-వేప పూత
-మిరియాలు
-బెల్లం
ఉగాది పచ్చడి తయారీ విధానం
-ముందుగా చింతపండు నానబెట్టాలి. ఇందుకోసం ఓ బౌల్ లో గింజలు తీసేసిన 35 గ్రాముల కొత్త చింతపండు వేసి ఇందులో 200 ml నీళ్లు పోసి పావు గంట సేపు పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు వేప పూతను అరచేతిలో వేసి నెమ్మదిగా మర్దన చేస్తే పూరేకులు విడిపడతాయి. పూరేకులుగా విడిపోయినది ఒక పెద్ద చెంచా ఉండేలా చూసుకోండి. మదించిన తర్వాత అందులోని కాడలు, మొగ్గలు తీసేయండి.
-తర్వాత 20 మిరియాలు, అర చెంచా రాతి ఉప్పు వేసి మెత్తగా దంచి పక్కనపెట్టుకోవాలి.
-ఇప్పుడు రెండు మామిడి పిందెలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
-ఇప్పుడు నానిన చింతపండుని మెత్తగా పిండి పిప్పి తీసి పడేయాలి.
-చింతపండు పులుసులో కట్ చేసిన మామిడి ముక్కలు, రెండు చెంచాల బెల్లం తరుము, వేప పువ్వు రేకులు, దంచి పెట్టుకున్న మిరియాలు ఉప్పు మిశ్రమం వేసి మెత్తం బాగా కలపండి. అంతే నిజమైన ఉగాది పచ్చడి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications