Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
Ugadi Pachadi 2025: ఈసారి ఉగాది పచ్చడిలో ఇది కలుపుకుంటే లక్ష్మీ అనుగ్రహం మీపైనే, రుచికి రుచి.. అదృష్టానికి అదృ
ఉగాది సమయం దగ్గరికి వచ్చేసింది. తెలుగు ప్రజల నూతన సంవత్సరమైన ఈ ఉగాది.. ఈ సంవత్సరం మార్చి 30వ తేదీన వస్తోంది. ఆరోజు నుంచి తెలుగు నూతన సంవత్సరం మొదలవుతుంది. ఉగాది అనేది తెలుగు ప్రజలకు అత్యంత సంప్రదాకాయకమైన, ముఖ్యమైన పండగ. ఈ పండగకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ పండగ రోజున ప్రతి ఒక్కరి ఇంట్లో ఉగాది పచ్చడి చేసుకొని తింటారు. గోవులను పూజించడం, వాటిని శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలను కొన్ని ప్రాంతాల్లో చేస్తారు. ప్రతి ఒక్క దేవతలను పూజించి చేయడం వంటివి చేస్తారు.
అయితే ఉగాది రోజున అన్నిటికంటే ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. సాంప్రదాయకమైన ఈ పచ్చడి వెనకాల ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ పచ్చడి తయారీలో వినియోగించే పదార్థాలు ఎన్నో విషయాలను సూచిస్తాయి. కాలం మారుతున్న కొద్దీ ఈ పచ్చడి విలువ అనేది తగ్గిపోతుంది. చాలా మందికి దీనిని ఎలా చేసుకోవాలో కూడా తెలియడం లేదు. భావి భారత పౌరులుగా మన ఆచార సంప్రదాయాలను ముందు తరాల వారికి తెలియజేయడం అనేది అత్యంత ముఖ్యమైన విషయం. అందులో భాగంగానే ఈ స్టోరీలో అసలు సిసలైన సాంప్రదాయకమైన పద్దతిలో తెలుగు ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:
వేపపువ్వు - 1 టేబుల్ స్పూన్
మామిడికాయ ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
చింతపండు పులుసు - 3 టేబుల్ స్పూన్లు
బెల్లం తురుము - 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు - చిటికెడు
పచ్చిమిర్చి ముక్కలు - 1/2 టీ స్పూన్
కొబ్బరి ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
అరటిపండు ముక్కలు (ఐచ్ఛికం)
తయారీ విధానం:
చింతపండును నీటిలో నానబెట్టి, గుజ్జు తీయాలి.
బెల్లం తురుమును చింతపండు గుజ్జులో వేసి బాగా కలపాలి.
మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వేపపువ్వు,
ఉప్పు వేసి కలపాలి.
అన్ని పదార్థాలు కలిసేలా బాగా కలుపుకోవాలి.
మిగిలిన ఉప్మాలన్నీ వేస్ట్.. ఒక్కసారి ఈ ఉప్మా తింటే జీవితంలో మర్చిపోరు! ఎలా చేసుకోవాలో చూడండి!
షడ్రుచుల ప్రాముఖ్యత:
వేపపువ్వు - చేదు: జీవితంలోని కష్టాలను సూచిస్తుంది.
మామిడికాయ ముక్కలు - పులుపు: సవాళ్లను సూచిస్తుంది.
చింతపండు పులుసు - వగరు: ఒడిదుడుకులను సూచిస్తుంది.
బెల్లం తురుము - తీపి: సంతోషాన్ని సూచిస్తుంది.
ఉప్పు - ఉప్పు: ఆసక్తిని సూచిస్తుంది.
పచ్చిమిర్చి ముక్కలు - కారం: కోపాన్ని సూచిస్తుంది.
ఉగాది పచ్చడిని తినడం ద్వారా, జీవితంలో ఎదురయ్యే అన్ని అనుభవాలను
సమానంగా స్వీకరించాలని తెలుస్తుంది.
వేపపువ్వు:
రక్త శుద్ధికి తోడ్పడుతుంది.
చర్మ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
వేసవిలో వచ్చే అనేక రోగాలను నివారిస్తుంది.
మామిడికాయ ముక్కలు:
విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని
పెంచుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
వేసవి తాపం వలన వచ్చే వడదెబ్బ నుంచి కాపాడుతుంది.
చింతపండు పులుసు:
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపుతుంది.
కఫం, వాతం వంటి రుగ్మతలను నివారిస్తుంది.
బెల్లం తురుము:
శక్తిని అందిస్తుంది.
రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది.
ఉప్పు:
శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుతుంది.
శరీరానికి కావలసిన సోడియంను అందిస్తుంది.
పచ్చిమిర్చి ముక్కలు:
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
శరీరంలో వేడిని పుట్టిస్తుంది.
ఉగాది పచ్చడిలోని షడ్రుచుల ఆరోగ్య ప్రయోజనాలు:
తీపి: శక్తిని అందిస్తుంది, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.
పులుపు: జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, విటమిన్ సి అందిస్తుంది.
ఉప్పు: శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుతుంది.
కారం: జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, శరీరంలో వేడిని
పుట్టిస్తుంది.
చేదు: రక్త శుద్ధికి తోడ్పడుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
వగరు: జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, కడుపులో మంటను
తగ్గిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications