Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
ఉడిపి స్టైల్ టమోటో దోసె : బ్రేక్ ఫాస్ట్ కు భలే రుచిగా ఉంటుంది
Udupi Tomato Dosa మీరు రోజూ ఒకేరకమైన దోసె తిని బోరుకొడుతోందా? ఉదయం పూట ఇంట్లో దోసె ఎక్కువగా చేసేవారైతే ఈ రోజు కాస్త వరైటీగా గా దోసె తయారుచేసుకోండి. అందుకోసం ఒకసారి ఉడిపి టొమాటో దోసె చేసుకోండి. ఈ టొమాటో దోసె రవ్వ దోసెను పోలి ఉంటుంది.
ముఖ్యంగా ఇంట్లో దోసె పిండి లేనప్పుడు దోసె వేసుకోవాలంటే ఈ దోసె చేసి తినొచ్చు. ఈ టొమాటో దోసె కోసం కొబ్బరి చట్నీ గొప్ప సైడ్ డిష్ చేస్తుంది. మరీ ముఖ్యంగా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు.

ఉడిపి టమాటా దోసె ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఉడుపి టొమాటో దోస చాలా సింపుల్ రిసిపి. 10 నిమషాల్లో తాయారుచేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావల్సిన పదార్థాలు:
* టొమాటోలు - 2
* చిన్న ఉల్లిపాయలు - 5-6
* వెల్లుల్లి - 4
* గోధుమ పిండి - 1/4 కప్పు
* బియ్యం పిండి - 1/2 కప్పు
* మిరియాల పొడి - 1 టేబుల్ స్పూన్
* ఉప్పు - రుచి ప్రకారం
* కొత్తిమీర - కొద్దిగా
* జీలకర్ర - 1/2 tsp
* నీరు - పిండి కలుపుకోవడానికి సరిపడా
* నూనె -తగినంత
తయారుచేయు విధానం:
* ముందుగా టొమాటోను మిక్సీ జార్ లో ముక్కలుగా చేసుకోవాలి.
* తర్వాత అందులో చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు వేయాలి.
* తర్వాత ఒక బౌల్లో 1/4 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు బియ్యప్పిండి, 1
టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేయాలి.
* తర్వాత అందులో కొన్ని నీళ్లు పోసి బాగా రుబ్బుకోవాలి.
* తర్వాత ఒక గిన్నెలో గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పోసి,
అందులో సన్నగా తరిగిన కొత్తిమీర మరియు 1/2 టీస్పూన్ జీలకర్ర వేసి,
రవ్వ దోసలా పిండి కలుపుకోవడం కోసం అవసరమైన నీరు వేసి బాగా కలపాలి.
* చివరగా స్టౌ మీద పాన్ పెట్టి అందులోకి చెంచా కలిపిన పిండిని రవ్వ
దోశలా కాల్చి నూనె వేసి బంగారు రంగు వచ్చేవరకు ఉడికించుకుంటే
రుచికరమైన ఉడిపి టమాటా దోసె రెడీ.
Image Courtesy: Dindigul Food Court
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications