Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
దోశను మించిన టిఫిన్ ఇది.. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదలరు, ఇంట్లో ఎలా చేసుకోవాలంటే?
ఉదయాన్నే టిఫిన్ అంటే చాలా మందికి గుర్తొచ్చేది ఇడ్లీ, దోష, బోండా, పూరి మాత్రమే. కానీ మీరెప్పుడైనా ఊతప్పం ట్రై చేశారా?. ఊతప్పం అనేది దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధమైన అల్పాహారం. ఇది దోస పిండితో తయారు చేస్తారు. కానీ దీనికి ఉల్లిపాయలు, టమోటాలు, మిరియాలు, కొత్తిమీర వంటి కూరగాయలు వేసుకుంటారు. అసలు ఈ ఊతప్పం ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
దోస పిండి - 2 కప్పులు
ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగినది)
టమోటా - 1 (చిన్నగా తరిగినది)
పచ్చిమిర్చి - 2 (చిన్నగా తరిగినది)
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు (చిన్నగా తరిగినది)
ఉప్పు - రుచికి తగినంత
నూనె - కాల్చడానికి తగినంత

తయారీ విధానం:
ఒక గిన్నెలో దోస పిండి, ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర మరియు ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తరువాత పెనం వేడి చేసి నూనె వేయాలి.
ఇప్పుడు పిండిని పెనంపై వేసి పలుచగా పరచాలి. అనంతరం ఊతప్పం ఒక వైపు బంగారు రంగు వచ్చేవరకు కాల్చాలి. దీంతో పాటు ఊతప్పంను మరోవైపు తిప్పి కాల్చాలి. ఆ తరువాత ఓ ప్లేట్లో తీసుకోవాలి. ఇలా పిండితో మొత్తం ఊతప్పం వేసుకోవాలి. అనంతరం వేడి వేడిగా చట్నీతో లేదా సాంబార్‌తో సర్వ్ చేయాలి. అంతే ఎంతో రుచికరమైన ఊతప్పం సిద్ధమైనట్లే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications