Latest Updates
-
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.! -
ఐరన్, ప్రొటీన్ అబ్బా.. సూపర్ హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ చపాతీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య! -
మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి! -
ఈ టేస్ట్ నెవర్ బిఫోర్.. సండే స్పెషల్ పాలకూర చికెన్, చిక్కటి గ్రేవీకి మైమరిచిపోతారు.! -
సెప్టెంబర్ 17 న కన్యారాశిలోకి సూర్యుడు.. నెల రోజులపాటు మహర్జాతకులు అంటే వీరే.! -
పసిపిల్లలకు డ్రై ఫ్రూట్స్ ఎప్పటినుంచి ఇవ్వాలి? ఎలా పెడితే ఆరోగ్యానికి మంచిది?
వెజ్ బర్గర్..ఇంట్లో ఈజీగా ఇలా చేసుకోండి..బేకరి టేస్ట్ కన్నా అదిరిపోతుంది
ఈ రోజుల్లో పిల్లలు,పెద్దలు వయస్సుతో సంబంధం లేకుండా జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా మువత అయితే సెలవు రోజుల్లో లేదా ఆఫీసు సమయాల్లో బ్రేక్ టైంలో బయటకు వెళ్లి బేకరీల్లో ఎదురుగా కనిపించే పిజ్జాలు,బర్గర్ లు ఇష్టంగా తింటున్నారు. అయితే రుచికరమైన వెజ్ బర్గర్ ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకొని ఆస్వాదించవచ్చు. ఇంట్లో చాలా ఈజీగా టేస్టీగా ఉండే వెజ్ బర్గర్ ని ఎలా తయారుచేసుకోవాలి?తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
కావాల్సినవి
బర్గర్ బన్స్ - 2
బ్రెడ్ క్రంబ్స్ - అరకప్పు
బంగాళ దుంపలు - 2
క్యారెట్ తురుము - అర కప్పు
మిరియాల పొడి - అర టీస్పూన్
చీజ్ స్లైసెస్ - 2
పసుపు - అర టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంద
బఠాణీ - 2 టీస్పూన్లు
ఫ్రెంచ్ బీన్స్ - ముప్పావు కప్పు
మైదా - 2 టేబుల్ స్పూన్లు
నూనె - తగినంత
టమాటా కెచప్ - కొద్దిగా
మయోనైజ్ - కొద్దిగా
లెట్యూస్ ఆకులు - కొన్ని
ఆనియన్ - 1
టమాటా - 1
ఆనియన్ - 1

వెజ్ బర్గర్ తయారు చేసే విధానం
- ఓ గిన్నెలో ఉడికించిన బంగాళదుంపలను పొట్టు తీసి మాష్ చేసుకోవాలి.
సన్నగా తరిగిన బీన్స్, క్యారెట్ తురుము, పచ్చి బఠాణీలను క్రష్
చేసుకొని రెడీగా ఉంచుకోవాలి.
-స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిన్ పోసి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక
అందులో క్యారెట్ తురుము,తరిగి పెట్టుకున్న బీన్స్,క్రష్ చేసి
పెట్టుకున్న బఠాణీ వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి.
-ఆ తర్వాత అందులో ఉప్పు, పసుపు, మిరియాల పొడి వేసి కలుపుకొని ఆ
వెజిటబుల్స్ బాగా ఉడికేలా చూడాలి.
- ఇప్పుడు ఆ మిశ్రమంలో మాష్ అయిన బంగాళదుంపను వేసుకొని బాగా మిక్స్
చేయాలి. ఆ తర్వాత బాండీని పొయ్యి మీదనుంచి దించుకొని
చల్లార్చుకోవాలి.
- ఆ మిశ్రమం చల్లారాక అందులో బ్రెడ్ క్రంబ్స్ పొడి వేసి బాగా
కలుపుకోవాలి.
-తర్వాత ఆ మిశ్రమాన్ని రెండు భాగాలుగా తీసుకొని పాట్టీస్లా
ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
-ఒక ప్లేట్లో బ్రెడ్ క్రంబ్స్ తీసుకొని పక్కన ఉంచుకోవాలి
- ఓ గిన్నెలో మైదా పిండిని తీసుకొని తగినంత వాటర్ పోసుకొని గడ్డలు
లేకుండా కలుపుకోవాలి.
-ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాట్టీస్ను మైదా
మిశ్రమంలో రెండు వైపులా ముంచి బ్రెడ్ క్రంబ్స్ తో అన్ని వైపులా కోట్
చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోని వేడి చేయాలి.
-బ్రెడ్ క్రంబ్స్ ఆ వేడి నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చే దాకా ఫ్రై
చేసుకోవాలి. వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన
పెట్టుకోవాలి.
-ఇప్పుడు రెండు బర్గర్ బన్స్ను మధ్యలోకి కట్ చేసుకోవాలి. బ్రెడ్ ఒక
సగ భాగానికి టమాటా కెచప్, మరో సగభాగానికి మయోనైజ్ అప్లై
చేసుకోవాలి.
-టమాటా కెచప్ అప్లై చేసుకున్న దానిపై మూడు తాజా లెట్యూస్
ఆకులు ఉంచి దాని మీద ఫ్రై చేసుకున్న ఒక పాట్టీస్
పెట్టుకోవాలి.
-తర్వాత ఆ ప్యాటీస్ మీద ఒక చీజ్ స్లైస్, మూడు టమాటా స్లైసెస్, కొన్ని
ఉల్లిపాయ ముక్కలు పెట్టి ఆపైన చిటికెడు ఉప్పు, మిరియాల పొడి
చల్లుకోవాలి. రుచికరమైన వెజ్ బర్గర్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
