Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
Veg Kabab: రెస్టారెంట్‌ను మించిన టేస్ట్‌తో సింపుల్‌గా వెజ్ కబాబ్ ఎలా చేసుకోవాలో తెలుసా?
చాలా మందికి కబాబ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. వీటిని తినేందుకు ప్రత్యేకంగా రెస్టారెంట్లకు కూడా వెళ్తుంటారు. కొందరు ఇంట్లోనే చేసుకొని తింటుంటారు. కానీ వారందరికీ రెస్టారెంట్లో దొరికే రుచి దొరకదు. చికెన్ కబాబ్ వరకు ఒకే.. కానీ వెజ్ కబాబ్ విషయానికి వస్తే అది ఎవరికీ చేసుకోవడం రాదు. వాటిని తినాలంటే కచ్చితంగా రెస్టారెంట్లకు వెళ్లాల్సిందే. అందుకే ఈ స్టోరీలో మేము వెజ్ కబాబ్ ఎలా చేసుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది పూర్తిగా వివరించాము. చదివి మీఇంట్లోనే దానిని తయారు చేసుకోండి.
వెజ్ కబాబ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
బంగాళాదుంపలు - 2 (ఉడికించినవి)
క్యారెట్ - 1 (తురిమినది)
బీన్స్ - 1/2 కప్పు (సన్నగా తరిగినవి)
పచ్చి బఠాణీలు - 1/2 కప్పు (ఉడికించినవి)
ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినది)
పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
గరం మసాలా - 1/2 టీస్పూన్
చాట్ మసాలా - 1/2 టీస్పూన్
కార్న్ ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు
బ్రెడ్ క్రంబ్స్ - 1/2 కప్పు
కొత్తిమీర - కొద్దిగా (సన్నగా తరిగినది)
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం:
- ముందుగా ఉడికించిన బంగాళాదుంపలను మెత్తగా మాష్ చేసుకోవాలి.
- ఒక గిన్నెలో మాష్ చేసిన బంగాళాదుంపలు, తురిమిన క్యారెట్, తరిగిన బీన్స్, ఉడికించిన బఠాణీలు, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చాట్ మసాలా, కార్న్ ఫ్లోర్, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి.
- ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, వాటిని కబాబ్ లాగా వత్తుకోవాలి.
- వత్తిన కబాబ్‌లను బ్రెడ్ క్రంబ్స్‌లో దొర్లించాలి.
- ఒక కడాయిలో నూనె వేడి చేసి, కబాబ్‌లను బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
- వేయించిన కబాబ్‌లను టిష్యూ పేపర్ వేసిన ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే రుచికరమైన వెజ్ కబాబ్ సిద్ధమైనట్లే.
- వేడి వేడి వెజ్ కబాబ్‌లను టొమాటో సాస్ లేదా గ్రీన్ చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications