Latest Updates
-
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట!
ఇంట్లో ఏం కూరగాయలు లేకుంటే లంచ్ లోకి ఇలా చేసేయండి..అమృతం అంటూ కంచం నాకేస్తారు
ఎప్పుడూ అవే పలావ్,అవే బిర్యానీలు తిని తిని బోర్ కొట్టేసిందా? అయితే ఓ సారి కుష్కా టేస్ట్ చూడండి..మళ్లీ మళ్లీ కావాలంటారు. ఇది వెజ్ పలావ్కు దగ్గరగా ఉన్నప్పటికీ తనదైన ప్రత్యేకతను కలిగి ఉంటుంది. మసాలాల సుగంధం, కూరగాయల పోషకాలు కలగలిపి వెజ్ కుష్కాను ఒక సంపూర్ణమైన, రుచికరమైన భోజనంగా మారుస్తాయి. దీనిని తయారు చేయడం చాలా సులువు, దీనికి ప్రత్యేకంగా కర్రీ అవసరం లేదు, రైతా లేదా సలాడ్ తో అద్భుతంగా ఉంటుంది.
ఇది సాధారణంగా టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా వివిధ రకాల మసాలా దినుసులను ఉపయోగించి తయారు చేస్తారు. దీని ప్రత్యేకత ఏమిటంటే కూరగాయల రుచి అన్నంలోకి చక్కగా కలిసిపోతుంది, ప్రతి ముద్దలోనూ ఆ రుచి స్పష్టంగా తెలుస్తుంది. వెజ్ కుష్కాని మీ ఇంట్లో తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
వెజ్ కుష్కా తయారీకి కావలసిన పదార్థాలు
-బాస్మతి బియ్యం - 2 కప్పులు
-నెయ్యి: 3-4 టేబుల్ స్పూన్లు
-బిర్యానీ ఆకు - 2
-యాలకులు - 3-4
-లవంగాలు - 5-6
-దాల్చిన చెక్క - 1 అంగుళం ముక్క
-అనాస పువ్వు - 1
-షాజీరా - 1 టీస్పూన్
-ఉల్లిపాయలు: 2
-పచ్చిమిర్చి: 3-4
-అల్లం వెల్లుల్లి పేస్ట్: 1.5 టేబుల్ స్పూన్లు
-టమాటోలు: 2
-బంగాళదుంప - 1
-క్యారెట్ - 1
-బీన్స్ - 10-12
-పచ్చి బఠాణీలు - 1/2 కప్పు
-పసుపు - 1/2 టీస్పూన్
-కారం - 1 టీస్పూన్
-ధనియాల పొడి - 1 టీస్పూన్
-గరం మసాలా - 1 టీస్పూన్
-పెరుగు: 2 టేబుల్ స్పూన్లు
-కొత్తిమీర: గుప్పెడు
-పుదీనా: గుప్పెడు
-ఉప్పు: రుచికి సరిపడా
-నీరు: 3.5 - 4 కప్పులు
-నిమ్మరసం: 1 టేబుల్ స్పూన్
కడుపునిండా తినాలనిపించే కమ్మని ఆవకాయ పులిహోర..నిమిషాల్లోనే ఇలా చేసుకోండి
వెజ్ కుష్కా తయారీ విధానం
-ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంటసేపు నీటిలో నానబెట్టండి. నానబెట్టిన తర్వాత నీటిని వడకట్టి పక్కన పెట్టుకోండి.
-ఒక ప్రెషర్ కుక్కర్ ను వేడి చేసి అందులో నూనె లేదా నెయ్యి వేయండి. నూనె వేడి అయిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, సాజీరా వేసి సువాసన వచ్చే వరకు వేయించండి.
-ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి బంగారు రంగు వచ్చేవరకు బాగా వేయించండి. ఉల్లిపాయలు బాగా వేగితేనే కుష్కాకు మంచి రుచి వస్తుంది.
-ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో చీల్చిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు 2-3 నిమిషాలు వేయించండి. తర్వాత తరిగిన టొమాటోలను వేసి మెత్తబడే వరకు ఉడికించండి. తర్వాత బంగాళదుంప, క్యారెట్, బీన్స్, పచ్చి బఠాణీలు వంటి తరిగిన కూరగాయలను వేసి 2-3 నిమిషాలు వేయించండి.
-ఇప్పుడు అందులో పసుపు, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా,బిర్యానీ మసాలా వేసి బాగా కలపండి. మసాలాలు మాడిపోకుండా తక్కువ మంట మీద వేయించండి. తర్వాత పెరుగు వేసి బాగా కలపండి.
-సగం కొత్తిమీర, సగం పుదీనా ఆకులు వేసి కలపండి. మిగిలినవి పక్కన ఉంచుకోండి.
-ఇప్పుడు నానబెట్టి వడకట్టిన బియ్యాన్ని వేసి మెల్లగా కలపండి, బియ్యం విరిగిపోకుండా చూసుకోండి. తర్వాత 3.5 - 4 కప్పుల నీరు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.
-కుక్కర్ మూత పెట్టి మీడియం మంట మీద 1-2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. విజిల్స్ వచ్చిన తర్వాత మంట ఆప, కుక్కర్ ఆవిరి పూర్తిగా పోయేవరకు అలాగే ఉంచండి.
-ఆవిరి పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి నిమ్మరసం పిండి, మిగిలిన కొత్తిమీర, పుదీనా ఆకులతో అలంకరించండి. అంతే కుష్కా రెడీ. వేడి వేడి వెజ్ కుష్కాను రైతా, సలాడ్ లేదా నచ్చిన కర్రీతో ఆస్వాదించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications





