Latest Updates
-
సెప్టెంబర్ 11 రాత్రి 7 గంటల తర్వాత..వృషభం, సింహం, వృశ్చిక రాశులకు లాటరీ తగిలినంత అదృష్టం! -
ఫ్రిజ్‌లో పెట్టినా నిమ్మకాయలు రంగు మారుతున్నాయా.. ఈ 3 టిప్స్‌తో ఎన్ని రోజులైనా తాజాగానే.! -
చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్‌తో కరకరలాడే మరమరాల మిక్స్చర్.! -
maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా! -
లిప్‌స్టిక్‌తో పెదాలు డ్రై అవుతాయా.. అధర అందం విషయంలో అతివలు చేసే పొరపాట్లు ఇవే.! -
చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు? -
గణేశ్ చతుర్థి స్పెషల్.. తమిళనాడు స్టైల్లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.! -
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే! -
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.! -
సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్ లుక్ మీరూ ట్రై చేశారా.?
ఆరోగ్యానికి అమృతం..చలికాలంలో ఫుల్ ఎనర్జీ ఇచ్చే రాగి సూప్ ఈజీగా ఇలా చేసుకోండి
ప్రస్తుతం చలి చంపేస్తోంది. పొద్దున్నే చలి గాలుల దెబ్బకి దుప్పటి తీయబుద్ది కావట్లేదు చాలామందికి. ఆఫీసులకు,పనులకు వెళ్లడం తప్పనివాళ్లకి మాత్రం నిద్రలేవక తప్పదు. అయితే చలికాలంలో పొద్దున్నే నిద్రలేవగానే వేడివేడిగా ఏదైనా తాగాలని చాలామంది కోరుకుంటారు. కొందరు టీ,కాఫీ వంటివి తాగుతుంటారు. మరికొందరు వేడివేడి సూప్ లను తాగేందుకు ఇష్టపడతారు.
ఆరోగ్యానికి ప్రయోజనం కలిగించే అనేక రకాల సూప్ లు ఉన్నప్పటికీ అందులో రాగి సూప్ లెక్కే వేరు. మన పూర్వీకులు రాగి సూప్ వంటివి బ్రేక్ ఫాస్ట్ గా తీసుకునేవాళ్లు. అందుకే అంత ఆరోగ్యంగా స్ట్రాంగ్ గా ఉండేటోళ్లు. చాలా చవకగా,చాలా ఈజీగా తయారు చేసుకోగలిగే వంటల్లో రాగి సూప్ ఒకటి. ఖర్చు తక్కువ,ఆరోగ్యానికి ప్రయోజనం ఎక్కువ కలిగించే రాగి సూప్ ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలి,దీని తయారీకి ఏం కావాలి వంటి వివరాలు ఇక్కడ చూడండి.

రాగి సూప్ తయారీకి కావాల్సినవి
1 కప్పు రాగి పిండి
1 టీస్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి
1 కప్పు క్యారెట్,బీన్స్,స్వీట్ కార్న్ అన్నీ కలిపి
కొన్ని సన్నగా తరిగిన ఉల్లిపాయలు
1 స్పూన్ నెయ్యి
1 టీస్పూన్ సన్నగా తరిగిన అల్లం,వెల్లుల్లి
పావు కప్పు చిలికిన పెరుగు
రుచికి సరిపడా ఉప్పు
1/2 స్పూన్ మిరియాల పొడి
రాగి సూప్ తయారు చేసే విధానం
-ఫస్ట్ ఓ బౌల్ లో రాగి పండిని తీసుకోవాలి.అందులో ఒక గ్లాస్ రాగి పిండి
తీసుకుంటే రెండు గ్లాస్ ల నీళ్లు పోయాలి. అంటే పిండి ఎన్ని గ్లాస్ లు
తీసుకునే రెట్టింపు వాటర్ పోయాలి అన్నమాట.
-నీళ్లు పోసిన తర్వాత రాగిపిండి ఉండలు లేకుండా బాగా కలపి పక్కన
పెట్టుకోండి
-ఇప్పుడు కూరగాయలను సన్నగా కట్ చేసుకుని అన్నింటిని 1 కప్పు వచ్చేలా
కలిపి సిద్దంగా ఉంచుకోండి.
-పొయ్యి మీద పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడి
చేయాలి.
-నెయ్యి వేడెక్కాక అందులో అల్లం, వెల్లుల్లి, సన్నగా తరిగిన
పచ్చిమిర్చి వేసి వేయించాలి.
-ఆ తర్వాత క్యారెట్,స్వీట్ కార్న్,బీన్స్ లాంటి ఏదైనా మీకు నచ్చిన
మిక్స్‌డ్ వెజిటేబుల్స్ వేసి వేయించాలి.
-సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి కూరగాయలు సగం ఉడికేంత వరకు ఫ్రై
చేయాలి. ఆ తర్వాత అర కప్పు నీళ్లు పోసి కూరగాయలను కాసేపు
ఉడికించాలి.
-కూరగాయలు ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుతూ
వేగించాలి.
-ఇప్పుడు కలిపిపెట్టుకున్న రాగి మిశ్రమాన్ని అందులో పోసి కాసి
ఉడకబెట్టి పొయ్యి ఆపెయ్యండి.
-వేడి తగ్గాక అందులో పావు కప్పు చిలికిన పెరుగు కలపండి.
-ఆ తర్వాత మీ రుచికి తగినంత ఉప్పు, కొంత మిరియాల పొడిని కలుపుకుంటే
హెల్తీ వెజ్ రాగి సూప్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
