Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
గుజరాత్ స్పెషల్ ఢోక్లా..అద్భుతమైన రుచితో పాటు ఆరోగ్యం కూడా,ఎలా చేసుకోవాలో చూడండి
ఎప్పుడూ ఒకరకమైన స్వీట్లు,వంటకాలు తిని తిని బోర్ కొట్టిందా? కొత్తగా,రుచికరంగా ఏదైనా నాలుకకి తగిలితే బాగుంటది అనుకుంటున్నారా? అయితే ఓసారి ఢోక్లా ట్రై చేసి తీరాల్సిందే. ఢోక్లా గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఒక సాంప్రదాయకమైన వంటకం. ఇది ఆరోగ్యకరమైనది కూడా. ఢోక్లా ఆవిరిలో ఉడికిస్తారు కాబట్టి, ఇది నూనెలో వేయించిన స్నాక్స్ కంటే ఆరోగ్యకరమైనది. ఢోక్లాలో పోషకాలు ఉంటాయి, కేలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.
ఢోక్లా తేలికగా జీర్ణమవుతుంది కాబట్టి ఇది పిల్లలకు, వృద్ధులకు ఇలా అన్ని వయస్సుల వారికి కూడా మంచిది. కాబట్టి ఈ రుచికరమైన స్పాంజ్ డిష్ ని ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

ఢోక్లా తయారీకి కావలసిన పదార్థాలు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - 2
శెనగపిండి - 1 కప్పు
పెరుగు - 1/2 కప్పు
ఆవాలు - 1 టీస్పూన్
జీలకర్ర - 1/2 టీస్పూన్
కరివేపాకు - కొన్ని ఆకులు
కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
అల్లం - 1/2 అంగుళం
పసుపు - 1/4 టీస్పూన్
ఇంగువ - చిటికెడు
వంట సోడా - 1/2 టీస్పూన్
నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
పంచదార - 1 టీస్పూన్
పచ్చికారం ఎగ్ కర్రీ ఎప్పుడైనా తిన్నారా? జిందగీలో ఇలాంటి టేస్ట్ చూసి ఉండరు,ఎలా చేయాలంటే
ఢోక్లా తయారీ విధానం
-ఢోక్లా తయారీకోసం ముందుగా ఒక గిన్నెలో శెనగపిండి, పెరుగు, పసుపు, ఇంగువ, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తరుము, ఉప్పు వేసి బాగా కలపాలి.
-కొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా పిండిని బాగా కలపాలి. పిండి మరీ పలుచగా లేదా మరీ చిక్కగా ఉండకూడదు.
-కలిపిన ఈ మిశ్రమాన్ని 10-15 నిమిషాలు పక్కన పెట్టాలి.
-ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాలి.
-తర్వాత ఒక ప్లేట్ కు ఆయిల్ రాసి, పిండి మిశ్రమంలో వంట సోడా, నిమ్మరసం, పంచదార వేసి బాగా కలపాలి.
-పిండిని నూనె రాసిన ప్లేట్ లో వేసి, ఆవిరిలో 15-20 నిమిషాలు ఉడికించాలి.
-ఢోక్లా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక టూత్ పిక్ ని గుచ్చి చూడాలి. టూత్‌పిక్ కి పిండి అంటుకోకుండా వస్తే ఢోక్లా ఉడికినట్లు.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఆయిల్ వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలాడనివ్వాలి. తాలింపులో కొద్దిగా ఇంగువ వేస్తే ఢోక్లా రుచి మరింత పెరుగుతుంది.
-తాలింపును ఢోక్లాపై వేసి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
-ఢోక్లాను ముక్కలుగా కోసి, కొబ్బరి చట్నీ లేదా టమాటా సాస్‌తో తింటే అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications