Guntur Chicken: అరిటాకు భోజనంలో..నోరూరించే స్పైసీ గుంటూరు చికెన్ రిసిపి

ఆంధ్రా రుచులంటే ఇష్టపడని వారంటూ ఉండరు. ముఖంగా కొంచెం కారంగా తినాలనుకునే వారికి గుంటూరు వంటకాలు స్పెషల్ గా ట్రీట్ చేస్తాయి. గుంటూరు వంటల్లో చికెన్ రిసిపి చాలా ఫేమస్. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో స్థానికులు తయారుచేసు

Posted By:

ఆంధ్రా రుచులంటే ఇష్టపడని వారంటూ ఉండరు. ముఖంగా కొంచెం కారంగా తినాలనుకునే వారికి గుంటూరు వంటకాలు స్పెషల్ గా ట్రీట్ చేస్తాయి. గుంటూరు వంటల్లో చికెన్ రిసిపి చాలా ఫేమస్. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో స్థానికులు తయారుచేసుకునే వంటకాలలో గుంటూరు చికెన్ రిసిపి చాలా ప్రసిద్ది చెందింది.

How to prepare Gunturu Special chicken recipe in telugu

గుంటూరు వంటలకు ఎందుంకు అంత ప్రత్యేకత అంటే శతాబ్దాల పాటు ఈ ప్రాంతాన్ని నిజాంలు మరియు మొఘలుల పరిపాలించిన కారణంగా ఆంధ్ర ప్రదేశ్ వంటకాలకు రాయల్ టచ్ ఉంటుంది. అయితే, ఇది ఒక విలక్షణమైన దేశీ చికెన్ రిసిపి. లేత చికెన్ ముక్కలతో పాటు తాజాగా తయారుచేసుకున్న మసాలా దినుసుల పొడి లేదా పేస్ట్ ను జోడించడం ద్వారా చికెన్ రిసిపి స్పైసీగా తయారు చేయబడుతుంది. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా పండించే ఎర్ర మిరపకాయల నుండి ఇది మసాలా కారంగా రుచికరంగా ఉంటుంది.

How to prepare Gunturu Special chicken recipe in telugu

గరం మసాలా తయారీకి ధనియాల పొడి, దాల్చిన చెక్కలు, యాలకులు, జీలకర్ర మరియు మిరియాల వంటి పదార్ధాలను ఉపయోగిస్తారు, అయితే బే ఆకులు, యాలకులు, లవంగాలు మరియు దాల్చిన చెక్క కర్రలు వంటి మొత్తం మసాలా దినుసులు డిష్‌కు మసాలా రుచిని జోడించడానికి ఉపయోగిస్తారు.మరి ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం..

Guntur Chicken: అరిటాకు భోజనంలో..నోరూరించే స్పైసీ గుంటూరు చికెన్ రిసిపి
Guntur Chicken: అరిటాకు భోజనంలో..నోరూరించే స్పైసీ గుంటూరు చికెన్ రిసిపి
Prep Time
15 Mins
Cook Time
30M
Total Time
45 Mins

Recipe By: Boldsky

Recipe Type: ప్రధాన కోర్సు

Serves: 1 కప్పు

Ingredients
  • కావలసిన పదార్థాలు:

    • చికెన్ : 500 grms (శుభ్రంగా కడిగి, నీరు పూర్తిగా వంపి, కావాల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలి)
    • ఎండు ఎర్ర మిరపకాయలు : 5
    • ఉల్లిపాయలు తరిగిన: 100 grms
    • టమోటాలు : 150 grms (సన్నగా తరిగినవి)
    • ఆవాలు: 1/2 tsp
    • మిరియాలు: 1tsp
    • జీలకర్ర: 1tsp
    • పెరుగు: 2 tsp
    • కొబ్బరి తురిమినది : 3 tsp
    • ధనియాలు: 3 tsp
    • అల్లం వెల్లుల్లి పేస్ట్: 3 tsp
    • నూనె: 4 tsp
    • ఏలకులు : 1
    • దాల్చిన చెక్క: 1/2 అంగుళం
    • లవంగాల పొడి: 1/8 tsp
    • కొన్ని మెంతి గింజలు
    • కొన్ని కొబ్బరి ముక్కలు
    • కొన్ని కొత్తిమీర ఆకులు
    • రుచికి సరిపడా గరం మసాలా పొడి
How to Prepare
  • గుంటూరు చికెన్ తయారుచేయు విధానం

    • 1. ఎండు మిరపకాయలు, కొత్తిమీర, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, లవంగాల పొడి, దాల్చినచెక్క, యాలకులు, కొబ్బరి తురుము విడివిడిగా బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
    • 2. వాటిని కొద్దిగా నీళ్లతో కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
    • 3. పెద్ద పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయండి.
    • 4. ఉల్లిపాయలను ఒకటి లేదా రెండు నిమిషాలు వేయించాలి.
    • 5. అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు గరం మసాలా పౌడర్ జోడించండి.
    • 6. బాగా కలుపుకోవాలి.
    • 7. టొమాటోలు, ఉప్పు, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్, పెరుగు మరియు కొద్దిగా నీరు జోడించండి.
    • 8. కొన్ని నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి, 10 నిముషాల తర్వాత చికెన్ జోడించండి.
    • 9. చికెన్ ముక్కలు మసాలాతో బాగా కలిసిపోయే వరకు ఒకటి లేదా రెండుసార్లు కలయతిప్పి వేయించాలి.
    • 10. పాన్‌పై ఒక మూతపెట్టి, మంటను కనిష్టంగా తగ్గించండి.
    • 11. 20 నుండి 30 నిమిషాలు మీడియం మంట మీద, ఉడికించాలి.
    • 12. ఎప్పటికప్పుడు కలియతిప్పుతుంటే పాన్ అడుగు అంటకుండా ఉంటుంది.
    • 13. గ్రేవీ చిక్కగా మారినప్పుడు మరియు నూనె పైకి తేలడం ప్రారంభించినప్పుడు, మంట నుండి పాన్ తొలగించండి.
    • 14. కొత్తిమీర తరుగు మరియు తరిగిన కొబ్బరి ముక్కలతో అలంకరించండి. అంతే కారకారంగా గుంటూరు చికెన్ రెసిపి రెడీ..
    • 15. అన్నంతో సర్వ్ చేయండి. ఈ విలక్షణమైన ఆంధ్రా స్టైల్ సాంప్రదాయ వంటకాన్ని తినడానికి అరటి ఆకుపై దీన్ని సర్వ్ చేయండి!
Instructions
  • మీరు గుంటూర్ గ్రేవీ వద్దనుకుంటే డ్రైగా ఉండాలనుకుంటే, మొత్తం తేమ ఆవిరైపోయే వరకు ఉడికించి ఫ్రై చేయండి అంతే.మరి ఇక ఆలస్యం ఎందుకు, ఈ గుంటూర్ చికెన్ ను మీరు కూడా ట్రై చేసి, రుచి చూసి, మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి
Nutritional Information
  • కప్పు - 1 కప్పు
  • పరిమాణం - 1 కప్పు
  • కొవ్వు - 33 g Fat (32.61%)
  • ప్రోటీన్ - 29 g Protein (28.98%)
  • కార్బోహైడ్రేట్లు - 26 g Carbs (26.00%)
  • చక్కెర - 0
[ 5 of 5 - 99 Users]
Desktop Bottom Promotion