Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఘుమఘుమలాడే మజ్జిగ పొడి..ఒక్కసారి చేసుకుంటే నెలల పాటు నిల్వ..ఎప్పుడంటే అప్పుడు చిటికెలో టేస్టీ మజ్జిగ
వేసవి కాలంలో శరీరానికి చలువ చేసే పానీయాల్లో మజ్జిగ అత్యుత్తమమైనది. అయితే ప్రతిసారి అల్లం, పచ్చిమిర్చి కోసి మజ్జిగ తయారు చేయడం కుదరకపోవచ్చు. అలాంటి సమయంలో ఇన్స్టంట్ మజ్జిగ పొడి ఎంతో ఉపయోగపడుతుంది. ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెలల తరబడి వాడుకోవచ్చు.
సాఫ్ట్ డ్రింక్స్‌కు బదులుగా ఇలాంటి సహజసిద్ధమైన పానీయాలను అలవాటు చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు. ఇన్స్టంట్ మజ్జిగ పొడి ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-జీలకర్ర
-ధనియాలు
-మిరియాలు
-ఎండిన అల్లం(శొంఠి)
-కరివేపాకు
-రాళ్ల ఉప్పు
-ఇంగువ
-వాము
తయారీ విధానం
-ముందుగా 8 గ్రాముల శొంఠిని దంచి పక్కన ఉంచుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులో కడిగి నీడన ఆరబెట్టిన 7 రెబ్బల కరివేపాకు వేసి తక్కువ మంట మీద చెమ్మ ఆరేంతవరకు రోస్ట్ చేసుకొని(దీనికి 5-6 నిమిషాల సమయం పడుతుంది)తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీలో అర కప్పు జీలకర్ర, అర కప్పు ధనియాలు వేసి సన్నని సెగ మీద కలుపుతూ మంచి సువాసన వచ్చేవరకు(దీనికి సుమారు 4 నిమిషాలు పడుతుంది) వేయించిన తర్వాత ఇందులోనే ఒకటిన్నర టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ వాము, దంచిన శొంఠి వేసి సన్నని సెగ మీద మాత్రమే మంచి సువాసన వచ్చేదాకా(దీనికి 15 నిమిషాలు పడుతుంది) వేయించుకొని స్టవ్ ఆపేయండి.
-ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులో వేయించినవన్నీ వేయండి. ఇందులోనే కొంచెం 1 టీస్పూన్ ఇంగువ, ఒకటిన్నర టేబుల్ స్పూన్ల రాళ్ల ఉప్పు వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి.
-మిశ్రమం మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి వీలైనంత మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి. కొంచెం బరకగా వస్తే జల్లెడలో జల్లించుకొని బరకగా వచ్చినదాన్ని మళ్లీ మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అంతే మజ్జిగ పొడి రెడీ.
-తయారైన పొడిని ఒక వెడల్పాటి ప్లేట్ లో పోసి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. ఇది 3 నుండి 6 నెలల వరకు తాజాగా ఉంటుంది.
-ఈ పొడితో మజ్జిగ ఎలా రెడీ చేసుకోవాలి
-ఒక గిన్నెలోకి 1 కప్పు(250 ml) పెరుగు తీసుకొని,ఇందులో గ్రైండ్ చేసుకున్న పొడి 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసి బాగా చిలకండి.
-తర్వాత అందులో 3 కప్పుల నీళ్లు పోసి బాగా చిలకండి. అంతే ఘుమఘుమలాడే,ఎంతో రుచిగా ఉండే మజ్జిగ రెడీ. దీనిపై కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే ఇంకా బాగుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications