పచ్చిమిర్చి ఊరగాయ ఇలా చేస్తే..ఒక్క ముద్ద తినేవాళ్లు నాలుగు ముద్దలు లాగించేస్తారు!

Posted By:

మన భారతీయుల భోజనంలో ఊరగాయ లేదా పచ్చడికి ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేడి వేడి అన్నంలో పప్పు నెయ్యి వేసుకున్నా, చపాతీలు, పరాఠాలు తిన్నా.. పక్కన కాస్త ఊరగాయ ఉంటే ఆ కిక్కే వేరు. అందులోనూ కారంగా, పుల్లగా ఉండే పచ్చిమిర్చి ఊరగాయ కనిపిస్తే చాలు.. ఎవరికైనా నోట్లో నీళ్లు ఊరాల్సిందే. ఒక ముద్ద తినేవాళ్లు నాలుగు ముద్దలు లాగించేస్తారు.

ఇంట్లోనే చాలా సులభంగా, ఎంతో రుచిగా పచ్చిమిర్చి ఊరగాయను ఎక్కువ కాలం నిల్వ ఉండేలా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Instant Hit How to Make the Perfect Green Chilli Pickle at Home in Telugu

కావలసిన పదార్థాలు

పచ్చి మిరపకాయలు: 250 గ్రాములు
ఆమ్ చూర్ : 2 టీస్పూన్లు లేదా 2 పెద్ద నిమ్మకాయల రసం
ఆవాల పొడి : 2 టీస్పూన్లు
సోంపు పొడి : 2 టీస్పూన్లు
మెంతుల పొడి : 1 టీస్పూన్ మెంతుల పొడి
నల్ల జీలకర్ర (కలోంజి): అర టీస్పూన్ నల్ల జీలకర్ర
పసుపు : అర టీస్పూన్ పసుపు
ఇంగువ : అర టీస్పూన్
ఆవ నూనె: 4-5 టేబుల్ స్పూన్లు
ఉప్పు: ఒకటిన్నర టీస్పూన్లు, అర టీస్పూన్ బ్లాక్ సాల్ట్

బెంగాలీ స్పెషల్ రాధాభల్లవి పూరీ..ప్లేట్ లోనే స్వర్గం కనిపించేస్తది!

తయారీ విధానం

-ముందుగా పచ్చి మిరపకాయలను చల్లటి నీటితో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత పొడి కాటన్ వస్త్రంతో తుడిచి, ఫ్యాన్ కింద లేదా ఎండలో ఒకటి, రెండు గంటల పాటు ఆరబెట్టాలి. వాటిలో కొంచెం కూడా తేమ ఉండకూడదు.

-పూర్తిగా ఆరిన మిరపకాయల తొడిమలు విరిచేయాలి. ఇప్పుడు చాకుతో ప్రతి మిరపకాయకు మధ్యలో పొడవుగా గాటు పెట్టాలి. మసాలా లోపల కూరడానికి వీలుగా ఈ గాటు ఉండాలి.

-ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో ఆవాల పొడి, సోంపు, మెంతులు, నల్ల జీలకర్ర, పసుపు, ఇంగువ, ఆమ్ చూర్ పొడి, రెండు రకాల ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

-స్టవ్ మీద పాన్ పెట్టి ఆవ నూనెను పొగలు వచ్చే వరకు బాగా వేడి చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి, నూనెను పూర్తిగా చల్లారనివ్వాలి.

-చల్లారిన నూనెలో సగం తీసుకుని, మనం ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పొడుల మిశ్రమంలో వేసి చిక్కటి పేస్ట్‌ లా కలపాలి. ఈ మసాలాను గాట్లు పెట్టిన పచ్చిమిరపకాయల లోపల నిండుగా కూరాలి.

-మసాలా కూరిన మిరపకాయలను శుభ్రమైన, పొడిగా ఉన్న గాజు సీసాలో జాగ్రత్తగా పేర్చాలి. మిగిలిన ఆవ నూనెను ఆ మిరపకాయల పైన పోయాలి.

-ఊరగాయ సీసా మూత గట్టిగా పెట్టి రెండు, మూడు రోజుల పాటు ఎండలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల మసాలాలన్నీ పచ్చిమిర్చికి పట్టి ఊరగాయ రుచి అమోఘంగా తయారవుతుంది.

[ of 5 - Users]
Story first published: Wednesday, September 9, 2026, 14:05 [IST]
Desktop Bottom Promotion