Latest Updates
-
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా!
weight loss recipe: బరువు తగ్గాలంటే ఇది తినాల్సిందే..జిందగీలో మర్చిపోలేని టేస్ట్,ఇలా చేసుకోండి
జొన్నరవ్వతో చేసిన ఉప్మా ఎప్పుడైనా తిన్నారా? ఇది ఆరోగ్యానికి మంచిది మాత్రమే కాకుండా బరువు తగ్గడంలో కూడా చాలా సహాయపడుతుంది. దీని టేస్ట్ మాత్రం అమృతంతో సమానమే అని చెప్పవచ్చు. అంత రుచికరంగా ఉంటుంది. హెల్తీ బ్రేక్ ఫాస్ట్, వెయిట్ లాస్ రెసిపి అయిన జొన్న రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలి,దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక్కడ చూడండి.
జొన్న రవ్వ ఉప్మా తయారీకి కావాల్సిన
పదార్థాలు
-జొన్న రవ్వ
-నెయ్యి
-జీడిపప్పు
-పోపు దినుసులు
-ఉల్లిపాయ
-పచ్చిమిర్చి
-క్యారెట్
-కొత్తిమీర
-కరివేపాకు
-ఉప్పు
-బఠాణీలు

జొన్న రవ్వ ఉప్మా తయారీ విధానం
-ముందుగా 1 కప్పు జొన్నరవ్వను శుభ్రంగా కడిన తర్వాత అందులో నీళ్లు పోసి 1 గంటపాటు నానబెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసి దోరగా వేయించి పక్కనపెట్టుకోండి.
-అదే పాన్ లోని నెయ్యిలో పోపు దినుసులు, రెండు ఉల్లిపాయల ముక్కలు, రెండు పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొంచెం క్యారెట్, కొన్ని పచ్చి బఠాణీలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
-తర్వాత అందులో 3 కప్పుల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఉడికించుకోండి.
-నీళ్లు బాగా మరిగిన తర్వాత అందులో నానబెట్టిన జొన్నరవ్వను వేసి కలుపుకోండి.
-తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ 10-15 నిమిషాలు ఉడికించుకోండి.
-తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కొంచెం కొత్తిమీర తరుగు వేసి కలుపుకోండి. అంతే వేడి వేడి జొన్నరవ్వ ఉప్మా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications