Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
కర్ణాటక స్పెషల్ చికెన్ చాప్స్..తింటే ఆ మజానే వేరు,ఎలా చేయాలంటే
కర్ణాటక వంటకాలలో చికెన్ చాప్స్ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. ఇవి రుచికరమైన మసాలాలు, సుగంధ ద్రవ్యాలతో నిండి ఉంటుంది. దీనిని అన్నం, రోటీ లేదా చపాతీతో కలిపి తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. కర్ణాటక స్పెషల్ చికెన్ చాప్స్ ఎలా తయారు చేయాలో, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ చూడండి.
చికెన్ చాప్స్ రెసిపి తయారీకి కావలసిన పదార్థాలు
చికెన్ - 500 గ్రాములు
ఉల్లిపాయలు - 2
టమోటాలు - 2
లవంగాలు - 3-4
యాలకులు - 2
కొత్తిమీర - కొద్దిగా
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
పసుపు పొడి - 1/2 టీ స్పూన్
కారం పొడి - 1-2 టీ స్పూన్లు
ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి - 1/2 టీ స్పూన్
గరం మసాలా - 1/2 టీ స్పూన్
కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు
నూనె - 3-4 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత
నిమ్మరసం - 1 టీ స్పూన్
ఎండుమిర్చి - 4-5
ధనియాలు - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - 1/2 టీ స్పూన్
మిరియాలు - 1/4 టీ స్పూన్
దాల్చిన చెక్క - చిన్న ముక్క

చికెన్ చాప్స్ తయారీ విధానం
-ముందుగా ఒక పాన్ లో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు ఒక గిన్నెలో మీడియం సైజులో కట్ చేసిన చికెన్ ముక్కలు, కొద్దిగా ఉప్పు, పసుపు పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. దీనిని కనీసం 30 నిమిషాలు మరినేట్ చేసుకోవాలి.
-తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
-ఉల్లిపాయలు వేగిన తర్వాత, మిగిలిన 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
-తర్వాత సన్నగా తరిగిన టమోటాలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
-ఇప్పుడు కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడి వేసి బాగా కలపాలి. మసాలా నూనెలో బాగా వేగే వరకు కొన్ని నిమిషాలు ఉడికించాలి.
-మరినేట్ చేసిన చికెన్ ముక్కలు వేసి మసాలా అంతా చికెన్ కు బాగా పట్టేలా కలపాలి.
-రుచికి తగినంత ఉప్పు వేసి కడాయి మూత పెట్టి మీడియం మంట మీద చికెన్ మెత్తగా ఉడికే వరకు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి..అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు.
-చికెన్ బాగా ఉడికిన తర్వాత గరం మసాలా, కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. ఒక రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.
-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి నిమ్మరసం పిండుకుంటే కర్ణాటక స్పెషల్ చికెన్ చాప్స్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications