Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
కాయీ హోలిగే రెసిపి । నారియల్ పూరన్ పోలి రెసిపి । కొబ్బరి ఒబ్బట్టు తయారీ
కాయి హోలిగే కర్ణాటక రాష్ట్ర సాంప్రదాయ తీపి వంటకం. దీన్ని పండగలకి ప్రత్యేకంగా చేసుకుంటారు. కాయి హోలిగే రెసిపి – చిత్రాలు, వీడియో మరియు స్టెప్ బై స్టెప్ విధానం
కాయి హోలిగే కర్ణాటక రాష్ట్ర సాంప్రదాయ తీపి వంటకం. దీన్ని పండగలకి ప్రత్యేకంగా చేసుకుంటారు. దీన్ని కొబ్బరి పోలి అని కూడా అంటారు. కొబ్బరి తురుము, బెల్లం కలిపి వండుతారు.
కొబ్బరి ఒబ్బట్టు దక్షిణాది ప్రత్యేక వంటకమైతే, బేలే ఒబ్బట్టు లేదా
పూరన్ పోలి మహారాష్ట్ర నుంచి వచ్చాయి. రెండిటి మధ్య ముఖ్యమైన బేధం
లోపల కూరే పదార్థం.
లోపల తీయని బెల్లం పదార్థం కూరబడి, పైన మెత్తని పొరలతో ఎంతో రుచిగా
ఉంటుంది. కాయి హొలిగేను సాధారణంగా ఇంట్లో పెద్దవారు చేస్తారు ఎందుకంటే
ఇదంత కష్టం కాబట్టి. కావాల్సిన పదార్థాల పరిమాణాలు, విధానం సరిగా
అనుసరించకపోతే మొత్తం పాడయిపోతుంది.
అందుకని మీరు ఇంట్లో దీన్ని ప్రయత్నించాలనుకుంటే, వీడియో, చిత్రాలతో కూడిన మా ఈ విధానాన్ని చూసి చేయండి.
Recipe By: కావ్యశ్రీ ఎస్
Recipe Type: స్వీట్లు
Serves: 4
-
రవ్వ ( చిరోటి రవ్వ) - 1 కప్పు
మైదా - ½ కప్పు
పసుపు - ¼ కప్పు
నీరు - 1 ½ కప్పు
తురిమిన కొబ్బరి 1 బౌల్
బెల్లం - 1 కప్పు
ఏలకుల పొడి -1/2 చెంచా
నూనె -8 చెంచాలు +1 కప్
ప్లాస్టిక్ పేపరు
-
1. కలిపే గిన్నెలో రవ్వను వేయండి.
2. మైదా, పసుపును వేయండి.
3. బాగా కలపండి.
4. 2 చెంచాల నూనెను వేయండి.
5. అప్పుడు, ముప్పావు వంతు నీరును కొద్దికొద్దిగా పోసి, మెత్తని పిండిలా మర్దించండి.
6. రెండుచెంచాల నూనెను వేసి మళ్ళీ 5 నిమిషాల పాటు కలపండి.
7. మళ్ళీ 4 చెంచాల నూనెను వేయండి.
8.దాని మీద మూతపెట్టి ఐదుగంటలు నానబెట్టండి.
9. మిక్సీ జార్ లో తురిమిన కొబ్బరిని వేయండి.
10. పావుకప్పు నీరు పోయండి.
11. మెత్తని పిండిలా చేసి పక్కన పెట్టుకోండి.
12. బెల్లాన్ని వేడి పెనంలో వేయండి.
13. వెంటనే, 1/4వ కప్పు నీరు పోయండి.
14. బెల్లాన్ని కరిగించి 5 నిమిషాలపాటు ఉడికించండి.
15. రుబ్బిన పేస్టును పెనంలో వేయండి.
16. మాడిపోకుండా కలుపుతూనే ఉండండి.
17. 10-15 నిమిషాలు పెనంలోంచి మిశ్రమం బయటకి వచ్చేసేదాకా ఉడకనివ్వండి.
18. ఏలకుల పొడిని వేసి బాగా కలపండి.
19. మిశ్రమాన్ని 10 నిమిషాలపాటు చల్లబడనివ్వండి.
20. అది మొత్తం చల్లబడ్డాక, చిన్న చిన్న ఉండలుగా కట్టుకోండి.
21. పూరీలు వత్తుకునే రాయిని తీసుకోండి.
22. దానిపై ప్లాస్టిక్ పేపర్ ను వేయండి.
23.దానికి నూనె రాసి జిడ్డు చేయండి.
24. కొంచెం మధ్యసైజు పిండిముద్ద తీసుకుని మరింత వత్తండి.
25. మీ అరచేయిలో వత్తుతూ మధ్యలో కూరే తీపి పదార్థాన్ని పెట్టండి.
26. ఖాళీలేకుండా పైనంతా మూసేసి, సరిగా అంచులు వత్తండి.
27. ప్లాస్టిక్ పేపరుపై పెట్టి చేత్తో మరింత వత్తండి.
28. అప్పడాల కర్రతో వత్తండి.
29. రోటీలలాగా అప్పడాల కర్రతో వత్తండి.
30. పెనాన్ని వేడిచేయండి.
31. పెనంపై ఉన్న కాగితంతో సహా బొబ్బట్టును తిరగేసి కాగితం జాగ్రత్తగా తీసేయండి.
32. ఒకవైపు ఉడకనిచ్చాక, మరోవైపు కొంచెం నూనె చుక్కలు వేయండి.
33. మళ్ళీ తిరగేసి గోధుమరంగులోకి మారేవరకు వేయించండి.
- 1. మీరు ఎంత పిండిని మర్దిస్తే అంత మెత్తగా హోలిగేలు వస్తాయి.
- 2. లోపల కూరేది హల్వాలో లాగా పెనం బయటకి వచ్చేస్తూ మధ్యలో గడ్డకడుతున్నంతవరకూ ఉడికించాలి.
- వడ్డించే పరిమాణం - 1 ముక్క
- క్యాలరీలు - 256 క్యాలరీలు
- కొవ్వు - 11 గ్రాములు
- ప్రొటీన్ - 2 గ్రాములు
- కార్బొహైడ్రేట్లు - 35 గ్రాములు
- చక్కెర - 23 గ్రాములు
తయారీ విధానం
1. కలిపే గిన్నెలో రవ్వను వేయండి.
2. మైదా, పసుపును వేయండి.
3. బాగా కలపండి.
4. 2 చెంచాల నూనెను వేయండి.
5. అప్పుడు, ముప్పావు వంతు నీరును కొద్దికొద్దిగా పోసి, మెత్తని పిండిలా మర్దించండి.
6. రెండుచెంచాల నూనెను వేసి మళ్ళీ 5 నిమిషాల పాటు కలపండి.
7. మళ్ళీ 4 చెంచాల నూనెను వేయండి.
8.దాని మీద మూతపెట్టి ఐదుగంటలు నానబెట్టండి.
9. మిక్సీ జార్ లో తురిమిన కొబ్బరిని వేయండి.
10. పావుకప్పు నీరు పోయండి.
11. మెత్తని పిండిలా చేసి పక్కన పెట్టుకోండి.
12. బెల్లాన్ని వేడి పెనంలో వేయండి.
13. వెంటనే, 1/4వ కప్పు నీరు పోయండి.
14. బెల్లాన్ని కరిగించి 5 నిమిషాలపాటు ఉడికించండి.
15. రుబ్బిన పేస్టును పెనంలో వేయండి.
16. మాడిపోకుండా కలుపుతూనే ఉండండి.
17. 10-15 నిమిషాలు పెనంలోంచి మిశ్రమం బయటకి వచ్చేసేదాకా ఉడకనివ్వండి.
18. ఏలకుల పొడిని వేసి బాగా కలపండి.
19. మిశ్రమాన్ని 10 నిమిషాలపాటు చల్లబడనివ్వండి.
20. అది మొత్తం చల్లబడ్డాక, చిన్న చిన్న ఉండలుగా కట్టుకోండి.
21. పూరీలు వత్తుకునే రాయిని తీసుకోండి.
22. దానిపై ప్లాస్టిక్ పేపర్ ను వేయండి.
23.దానికి నూనె రాసి జిడ్డు చేయండి.
24. కొంచెం మధ్యసైజు పిండిముద్ద తీసుకుని మరింత వత్తండి.
25. మీ అరచేయిలో వత్తుతూ మధ్యలో కూరే తీపి పదార్థాన్ని పెట్టండి.
26. ఖాళీలేకుండా పైనంతా మూసేసి, సరిగా అంచులు వత్తండి.
27. ప్లాస్టిక్ పేపరుపై పెట్టి చేత్తో మరింత వత్తండి.
28. అప్పడాల కర్రతో వత్తండి.
29. రోటీలలాగా అప్పడాల కర్రతో వత్తండి.
30. పెనాన్ని వేడిచేయండి.
31. పెనంపై ఉన్న కాగితంతో సహా బొబ్బట్టును తిరగేసి కాగితం జాగ్రత్తగా తీసేయండి.
32. ఒకవైపు ఉడకనిచ్చాక, మరోవైపు కొంచెం నూనె చుక్కలు వేయండి.
33. మళ్ళీ తిరగేసి గోధుమరంగులోకి మారేవరకు వేయించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.

Click it and Unblock the Notifications