Latest Updates
-
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026 -
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం
కేరళ స్పెషల్ పుట్టు..బ్రేక్ ఫాస్ట్ లోకి సూపర్,ఆరోగ్యం కూడా..ఎలా చేయాలంటే
పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ లోకి అదే ఇడ్లీ,అదే దోశ,అదే వడ, అదే పూరీ తిని తిని బోర్ కొట్టేసిందా? అయితే ఓ సారి కేరళ స్పెషల్ పుట్టు ట్రై చేయండి. పుట్టు అనేది కేరళలో చాలా ప్రసిద్ధి చెందిన వంటకం. మలయాళీలు ఎక్కువగా పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ లోకి దీనినే తింటారు. ఇది బియ్యం పిండి, కొబ్బరి తురుముతో తయారు చేయబడుతుంది. కేరళ పుట్టు రుచికరమైనది, ఆరోగ్యకరమైనది. ఇది బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల రోజంతా హుషారుగా ఉంటారు. దీనిని మీరు కూడా ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
పుట్టు తయారీకి కావలసిన పదార్థాలు
బియ్యం పిండి: 1 కప్పు
కొబ్బరి తురుము: 1/2 కప్పు
ఉప్పు: రుచికి సరిపడా
నీరు: తగినంత

పుట్టు తయారీ విధానం
-కేరళ స్పెషల్ పుట్టు తయారుచేయడానికి ముందుగా బియ్యం పిండిలో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి.
-తర్వాత కొద్దికొద్దిగా నీరు పోస్తూ పిండిని మెత్తగా కలపాలి. పిండి మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడిపొడిగా ఉండేలా కలుపుకోండి.
-పుట్టు తయారీకి ప్రత్యేకంగా పుట్టు కుడుము (Puttu Maker) ఉంటుంది. దానిలో ముందుగా కొబ్బరి తురుము వేయాలి.
-తర్వాత బియ్యం పిండిని వేసి మళ్లీ కొబ్బరి తురుము వేయాలి. ఈ విధంగా పొరలు పొరలుగా వేయాలి.
-పుట్టు కుడుమును మూత పెట్టి ఆవిరి మీద 10-15 నిమిషాలు ఉడికించాలి. అంతే కేరళ స్పెషల్ టేస్టీ పుట్టు రెడీ.
-పుట్టు ఉడికిన తర్వాత దానిని శెనగల కూరతో కలిపి తింటే టేస్ట్ అదిరిపోతుంది.
-కేరళ పుట్టును వివిధ రకాలుగా తయారు చేయవచ్చు. కొన్ని ప్రాంతాలలో గోధుమ పిండి, రాగి పిండితో కూడా తయారు చేస్తారు. అలాగే, కొబ్బరి తురుముకు బదులుగా బెల్లం కూడా ఉపయోగించవచ్చు.
వెల్లుల్లి తాళింపు అన్నం..నోటికి తగిలిందంటే పండగే..ఎలా చేసుకోవాలంటే
ప్రయోజనాలు
పుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చాలా తేలికగా జీర్ణమయ్యే అల్పాహారం. బియ్యం పిండిలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. కొబ్బరి తురుములో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇది మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications