Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
వెల్లుల్లి తాళింపు అన్నం..నోటికి తగిలిందంటే పండగే..ఎలా చేసుకోవాలంటే
రెగ్యులర్ గా అవే టమాటో రైస్,అదే జీరా రైస్,అదే అన్నం తిని తిని బోర్ కోట్టేసిందా? అయితే కొత్తగా వెల్లుల్లి తాళింపు అన్నం ఓ సారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. వెల్లుల్లి తాళింపు అన్నం..దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో చాలా పాపులర్ వంటకం. దీనిని తయారు చేయడం చాలా సులభం,అంతేకాకుండా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వెల్లుల్లిలో అనేక ఔషధ గుణాలు ఉండటం వల్ల ఈ అన్నం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీవైరల్, యాంటీబాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. వెల్లుల్లి రక్తపోటును తగ్గించి, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎముకల బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది. శరీరంలోని విషపదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.
వెల్లుల్లి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది కడుపులో గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వెల్లుల్లిలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉంటాయి. ఇది కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్, పోషకాలను సరఫరా చేస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసే వెల్లుల్లి తాళింపు అన్నం తయారుచేయడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

వెల్లుల్లి తాళింపు అన్నం తయారీకి కావలసిన పదార్థాలు
వండిన అన్నం: 2 కప్పులు
వెల్లుల్లి రెబ్బలు: 10-12
ఆవాలు: 1 టీ స్పూన్
జీలకర్ర: 1/2 టీ స్పూన్
కొత్తిమీర: కొద్దిగా
కరివేపాకు: కొద్దిగా
ఉప్పు:సరిపడా
ఎండుమిర్చి: 2-3
పచ్చిమిర్చి: 2
నూనె: 2 టేబుల్ స్పూన్లు
శనగపప్పు: 1 టేబుల్ స్పూన్
మినపప్పు: 1 టేబుల్ స్పూన్
పసుపు: 1/4 టీ స్పూన్
వన్స్ మోర్ అనిపించే సోయా రైస్..ఇంట్లో ఇలా చేసుకొని ఆస్వాదించండి
వెల్లుల్లి తాళింపు అన్నం తయారీ విధానం
-ముందుగా వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి చిన్నగా తరిగి పెట్టుకోవాలి.
-తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేడి చేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
-పప్పులు బంగారు రంగులోకి వచ్చాక తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి వెల్లుల్లి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. తర్వాత పసుపు వేసి బాగా కలపాలి.
-వెల్లుల్లిని మరీ ఎక్కువసేపు వేయించకూడదు, లేదంటే అది చేదుగా మారుతుంది.
-ఇప్పుడు అందులో వండిన అన్నం, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. అన్నం మొత్తం తాళింపుతో బాగా కలిసేలా చూడాలి. మిగిలిన అన్నంతో కూడా దీనిని చేసుకోవచ్చు.
-కొద్దిసేపు వేడి చేసి, కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేయాలి. వేడి వేడి వెల్లుల్లి తాళింపు అన్నం రెడీ. మీకు కావాలంటే ఈ అన్నంలో కొద్దిగా పల్లీలు లేదా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications