Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
Healthy Snack Recipe: కేరళ స్టైల్ బనానా చిప్స్..ఎన్ని తిన్నా ఇంకా ఇంకా అంటారు..ఎలా చేసుకోవాలంటే
సాధారణంగా కేరళ అనగానే మనందరికీ ఫస్ట్ గుర్తుకొచ్చేది పచ్చని కొబ్బరి తోటలు, బ్యాక్ వాటర్స్, మసాలా దినుసులు. అయితే కేరళలో అనేక వంటకాలు కూడా చాలా చాలా ఫేమస్. కేరళ సంప్రదాయ స్నాక్స్ లో ముఖ్యమైనది బనానా చిప్స్. కేవలం రుచిలోనే కాకుండా పోషక విలువల్లోనూ ఇవి ముందుంటాయి. సాధారణంగా నెంధ్రన్ అరటికాయలతో తయారు చేసే ఈ చిప్స్ టీ టైమ్ స్నాక్ గా చాలా మంది ఇష్టపడతారు. ఇంట్లోనే ఈ చిప్స్ ను సులభంగా, ఆరోగ్యకరంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
కేరళ స్టైల్ బానానా చిప్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-నెంధ్రన్ పచ్చి అరటికాయ
-ఉప్పు
-పసుపు
-నీళ్లు
-ఆయిల్

కేరళ స్టైల్ బనానా చిప్స్ తయారీ విధానం
-ముందుగా బాగా పచ్చిగా ఉండే అరటికాయలను తొడిమ,చివరలను కట్ చేసి తొక్కను పీలర్ లేదా చాకుతో పూర్తిగా తీసివేయాలి. తొక్క తీసేటప్పుడు అరటికాయల నుండి వచ్చే జిగురు చేతులకు అంటకుండా ఉండటానికి కొద్దిగా నూనె రాసుకోవచ్చు
-తొక్క తీసిన వెంటనే అరటికాయలను ఉప్పు వేసిన చల్లటి నీటిలో వేసేయాలి. ఇలా చేయడం వల్ల అవి నల్లబడకుండా ఉంటాయి.
-తర్వాత ఓ బౌల్ 1 టీస్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, పావు కప్పు నీళ్లు పోసి కలిపి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రై చేయడానికి తగినంత ఆయిల్ పోసి వేడి చెయ్యండి. కొబ్బరి నూనె అయితె బెటర్.
-ఆయిల్ వేడయ్యాక మంట తగ్గించి ఇప్పుడు అందులో నీళ్లలో ఉంచిన తొక్క తీసిన అరటిపండును తీసుకొని దాన్ని చిప్స్ స్లైసర్ మీద పెట్టి సన్నగా తురుముతూ వాటిని ఆయిల్ లో పడేలా చూడండి.ఇలా తరుమితేనే ఒకదానికొకటి అంటుకోకుండా బాగా వస్తుంది.
మహారాష్ట్ర స్పెషల్ రగడ చాట్..సాయంత్రం స్నాక్ కు పర్ఫెక్ట్ ఛాయిస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే
-చిప్స్ సగం వేగిన తర్వాత ముందుగా తయారుచేసుకున్న ఉప్పు పసుపు నీటి మిశ్రమం నుండి ఒక టీస్పూన్ నూనె లో వేయాలి. ఇది చిప్స్ కు అద్భుతమైన రుచిని, రంగును ఇస్తుంది. నీటిని వేసినప్పుడు నూనె కొద్దిగా పొంగడం సాధారణం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
- ఉప్పు పసుపు నీళ్లను బాండీలో వేగుతున్న చిప్ప్స్ మీద వేసి కలిపి పెద్ద మంట మీద వేపండి.
-చిప్స్ వేగి నూనెలో బుడగలు తగ్గేదాకా ఫ్రై చేయండి.
-తర్వాత వీటిని బాండీలో నుంచి తీసి జల్లెడలో వేసి చల్లారనివ్వాలి. అంతే క్రిస్పీ,క్రంచీ బనానా చిప్ప్ రెడీ. ఈ బానానా చిప్స్ నెల రోజులపైనే నిల్వ ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
