Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
కోనసీమ స్పెషల్ కొబ్బరన్నం కోడికూర..ఇది తింటే ఉంటది గురూ మాటల్లో చెప్పలేరంతే,ఎలా చేయాలంటే
కోనసీమ వంటలకు కూడా పెట్టింది పేరు. ఇక్కడ వండే వంటలు చాలా రుచికరంగా ఉండటం మాత్రమే కాదు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకే కోనసీమ వంటలకు దేశవ్యాప్తంగా ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. కోనసీమ స్పెషల్ కొబ్బరన్నం చికెన్ కూర ఎప్పుడైనా తిన్నారా? ఇప్పటిదాకా తినకపోయినట్లయితే ఓసారి ఖచ్చితంగా తిని తీరాల్సిందే. చూస్తేనే కడుపు నిండిపోయే కొబ్బరన్నం కోడి కూర తింటుంటే ఆ మజా మాటల్లో చెప్పలేం. కోనసీమ స్పెషల్ కొబ్బరన్నం కోడికూర ఇంట్లో తయారుచేసుకోవడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
కొబ్బరన్నం కోడికూర తయారీకి కావలసిన పదార్థాలు
-ఆయిల్
-కంట్రీ చికెన్
-కొబ్బరి ముక్కలు
-పసుపు
-ఉప్పు
-కారం
-గుడ్లు
-లివర్
-ధనియాలు
-జీలకర్ర
-దాల్చిన చెక్క
-లవంగాలు
-యాలకలు
-అనాస పువ్వు
-పచ్చి మిర్చి
-ఉల్లిపాయ
-కరివేపాకు
-సోంపు
-గసగసాలు
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-జీడిపప్పు
-బిర్యానీ ఆకు
-మిరియాలు
-బియ్యం

కొబ్బరన్నం కోడికూర తయారీ విధానం
-1 కేజీ చికెన్ ముక్కలను ఒక గిన్నెలో వేసి శుభ్రంగా కడగాలి. మరో గిన్నెలో గుడ్లు,లివర్ వేసి పక్కనపెట్టుకోవాలి.
-చికెన్ ముక్కలలో 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం,పావు స్పూన్ పసుపు వేసి ఇవన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలిపి మూతపెట్టేసి అరగంట పాటు పక్కనపెట్టుకోవాలి.
-ఇప్పుడు గుడ్లు,లివర్ ఉన్న గిన్నెలో కూడా కొద్దిగా ఉప్పు,కారం,పసుపు వేసి పగలకుండా జాగ్రత్తగా కలిపి మూతపెట్టి పక్కపెట్టుకోవాలి.
-తర్వాత ఓ గిన్నెలో 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర,2 స్పూన్ల గసగసాలు, 1 స్పూన్ సోంపు, 6 లవంగాలు, 5 యాలకలు, కొంచెం దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, కొన్ని ఎండుకొబ్బరి ముక్కలు వేసి ఇవి మునిగేలా నీళ్లు పోసి కొద్దిసేపు నాననిచ్చి తర్వాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో కూరకు సరిపడా ఆయిల్ వేడి చేసి అందులో సన్నగా తరిగిన 3 ఉల్లిపాయల ముక్కలు, సన్నగా తరిగిన 5 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి కలుపుతూ వేయించుకోవాలి.
-ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అందులో 2 స్పూన్ల అల్లంవెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇందులో ఉండే పచ్చిదనం పోయే వరకు కలుపుతూ వేయించుకోవాలి.
-ఇప్పుడు అందులో ఉప్పు,కారం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి 5 నిమిషాలు కలుపుతూ వేయించుకోవాలి. అప్పుడు చికెన్ ముక్కలలో నుంచి నీళ్లు ఊరడం ప్రారంభమవుతుంది. అప్పుడు కూడా రెండు నిమిషాలు కలిపి మూతపెట్టి 15 నిమిషాలు తక్కువ మంట మీద మగ్గించుకోవాలి.
-మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
-ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు, 3 స్పూన్ల కారం, అర స్పూన్ పసుపు,గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ కూడా వేసి కలుపుతూ వేయించుకోవాలి.
-కూర ఉడకడానికి,మనకు కావాలసిన గ్రేవీకి తగినట్లుగా వేడి వేడి నీళ్లు అందులో పోయాలి.
-ఇప్పుడు అందులో ఓ గిన్నెలో పక్కన ఉంచిన గుడ్లు,లివర్ కూడా వేసి కుక్కర్ మూతపెట్టేసేయాలి. మంటలను తక్కువ ఉంచి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతే కోడి కూర రెడీ.
-ఇప్పుడు కొబ్బరన్నం తయారుచేయడం కోసం మిక్సీలో రెండు కప్పుల కొబ్బరి ముక్కలు వేసి అవి మునిగేంత వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత అందులో వేడివేడి నీళ్లు కొన్ని పోసి ఒక గిన్నెలో ఫిల్టర్ పెట్టుకొని పలుచటి కాటన్ గుడ్డు దానిమీద వేసి ఈ కొబ్బరి పాలను వడకట్టి తీసుకోవాలి. పిప్పిని పడేయాలి.
-ఇప్పుడు స్టవ్ మీద అన్నం వండుకునే గిన్నె పెట్టి అందులో 3 స్పూన్ల నూనె,గుప్పెడు జీడిపప్పు పలుకులు వేసి కలుపుతూ వేయించుకోవాలి. చివర్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేగిన తర్వాత ఈ మొత్తం ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కనపెట్టుకోండి.
-తర్వాత అదే నూనెలో 5 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క,1 అనాస పువ్వు,5 యాలకలు, 1 బిర్యానీ ఆకు, 7 మిరియాలు, 5 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు,అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి.
-తర్వాత మీరు ఒక గ్లాసు బియ్యం తీసుకునేటట్లయితే దానికి ఒకటిన్నర గ్లాసు చొప్పున కొబ్బరి పాలను కుక్కర్ లో పోయాలి. అలా ఎన్నిగ్లాసుల బియ్యం వండాలనుకుంటారో ఆ ప్రకారంగా కొబ్బరిపాలను పోయాలి. కొబ్బరిపాలు సరిపోకుంటే కొలతకు తగ్గట్లుగా నీళ్లు పోసుకోవచ్చు.
-ఇప్పుడు అందులో కొంచెం పసుపు,రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మరిగించాలి. తర్వాత అందులో కడిగి గంటపాటు నానబెట్టిన బియ్యం వేసి కలిపి మూతపెట్టేయాలి.
-5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి జాగ్రత్తగా కలిపి మళ్లా మూతపెట్టి ఉడికించుకోవాలి. అంతే కొబ్బరన్నం రెడీ. దీని మీద ముందుగా వేయించిన జీడిపప్పు కరివేపాకు వేసి కలపండి. ఇందులో ముందుగా చేసుకున్న చికెన్ కూర వేసుకొని కలిపి తింటుంటే నోట్లో బ్లాస్టింగే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications