Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
మహారాష్ట్ర స్పెషల్ కంద పోహా..బ్రేక్ ఫాస్ట్, లంచ్, స్నాక్ గా ఎలా తిన్నా సూపర్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
మహారాష్ట్రలో చాలామంది పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ లోకి కంద పోహా తింటుంటారు. దీనిని అటుకుల ఉప్మా అని మన దగ్గర అంటుంటారు. దీనిని బ్రేక్ ఫాస్ట్ గా,డిన్నర్ గా లేదా స్నాక్ గా ఎలా అయినా తినొచ్చు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయస్సుల వారికి నచ్చే వంటకం ఇది. ఒక్కసారి టేస్ట్ చేశారంటే మాత్రం మళ్లీ మళ్లీ చేసిపెట్టాలని ఇంట్లోవాళ్లని సతాయించడం గ్యారెంటీ. మహారాష్ట్ర స్పెషల్ కంద పోహాని ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలి, దీని తయారీకి ఏమేం పదార్థాలు కావాలో ఇప్పుడు చూద్దాం.
కంద పోహా తయారీకి కావలసిన పదార్థాలు
-అటుకులు
-బంగాళదుంప
-పల్లీలు
-ఆయిల్
-నిమ్మరసం
-పచ్చిమిర్చి తరుగు
-ఉల్లిపాయ తరుగు
-కరివేపాకు
-కొత్తిమీర తరుగు
-ఆవాలు
-జీలకర్ర
-ఇంగువ
-పసుపు
-ఉప్పు
-చక్కెర

కంద పోహా తయారీ విధానం
-ముందుగా 2 కప్పుల అటుకులని జల్లెడలో వేసి బాగా జల్లించుకోవాలి.
-తర్వాత అటుకులలో 300 ml నీళ్లు పోసి ప్రతి అటుకు తడిచేలా బాగా కలిపి పావుగంటసేపు పక్కన పెట్టుకోండి. ఎక్కువ నీళ్లు పోశారంటే ముద్ద అయిపోతుంది.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి వేడి చెయ్యండి.
-ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో పావు కప్పు పల్లీలు వేసి తక్కువ మంట మీద ఎర్రగా వేపుకోవాలి. వేగిన పల్లీలను ఓ ప్లేట్ లోకి తీసి పక్కనపెట్టుకోండి.
-తర్వాత అదే నూనెలో 1 టీస్పూన్ ఆవాలు వేసి చిటపటలాడేదాకా వేగాక అందులో 1 టీస్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి సన్నని తరుగు,రెండు చిటికెళ్ల ఇంగువ,2 రెమ్మల కరివేపాకు వేసి వేపుకోవాలి.
-తర్వాత అందులో రెండు ఉల్లిపాయల సన్నని తరుగు వేసి 2 నిమిషాలు వేపుకోవాలి. ఉల్లిపాయలు మరీ మెత్తబడేదాకా వేపకూడదు.
-తర్వాత అందులో చెక్కు తీసి చిన్నగా కట్ చేసిన 1 బంగాళదుంప ముక్కలు, చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు, ముప్పావు టీస్పూన్ చక్కెర వేసి బంగాళదుంప ముక్కల్లో పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి.
-తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి బాగా కలిపి మూతపెట్టి మీడిమం మంటమీద మగ్గనివ్వాలి. దీనికి 7-8 నిమిషాల సమయం పడుతుంది.
-తర్వాత అందులో తడిపి ఉంచుకున్న అటుకులు వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి.
-తర్వాత పాన్ అంచుల వెంట 3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి కదపకుండా మూతపెట్టి మీడిమం మంటమీద 5-6 నిమిషాలు అలా వదిలేయండి.
-తర్వాత స్టవ్ ఆపేసి అందులో వేయించుకున్న పల్లీలు, కొత్తిమీర తరుగు, నిమ్మరసం పిండి బాగా కలపండి. అంతే కంద పోహా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications