Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
దసరాకు ఈ స్వీట్ చేసి తినండి.. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాల్సిందే
పాస్తా అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో దీనిని ఎంతోమంది ఇష్టంగా తింటూ ఉంటారు. దీనితో చేసే మసాలా రెసిపీ కూడా ఎంతో రుచి కరంగా ఉంటుంది. అయితే పాస్తాను కేవలం బ్రేక్ ఫాస్ట్‌గా మాత్రమే కాకుండా స్వీట్‌గా చేసుకోవచ్చు. మామూలు పాస్తా కంటే ఈ స్వీట్ పాస్తా ఇంకా టేస్టీగా ఉంటుంది. అదే పాస్తా పాయసాన్నం. ఈ పాస్తా పాయసాన్నంని ఎలా చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేవి స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఇచ్చాము.. ఒకసారి మీరూ ట్రై చేయండి
పాస్తా పాయసాన్నంకి కావాల్సిన పదార్థాలు
> ఒక కప్పు పాస్తా
> చిటికెడు కుంకుమ పువ్వు
> గుప్పెడు.. బాదం, పిస్తా, జీడిపప్పు,
> పది కిస్ మిస్‌లు
> ఒక స్పూన్ నెయ్యి
> ఒక స్పూన్ యాలకుల పొడి
> ముప్పావు కప్పు చెక్కెర
> ఒక లీటర్ పాలు
> రెండు స్పూన్ నూనె

పాస్తా పాయసాన్నం తయారు చేసుకునే విధానం:
ముందుగా స్టవ్ ఆన్ చేసి.. దానిపై గిన్నె వేసి, అందులో కొన్ని నీళ్లు పోసి మరిగించాలి. కొంచెం మరిగాక అందులో చిటికెడు ఉప్పు, కొద్దిగా నూనె వేసి, మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. పది నిమిషాల పాటు నీళ్లు మరిగిన తరువాత.. అందులో పాస్తాను వేసి, బాగా ఉడికించుకోవాలి(పాస్తాను పూర్తిగా ఉడికించుకోవద్దు. 80% వరకు మాత్రమే ఉడికించుకోవాలి). అలా కాసేపు పాస్తా ఉడికిన తరువాత.. అందులోని నీళ్లను వంచేసి, పాస్తాను వేరు చేసి పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి, ఒక లీటర్ పాలు అందులో పోయాలి. పాలు కాస్త మరిగాక అందులో, మనం ముందుగా ఉడికించుకున్న పాస్తాను వేసి, పాలలో కలిసిపోయే విధంగా కలిపి, కొంచెం సేపు మళ్ళీ మరిగించుకోవాలి. అనంతరం ముప్పావు కప్పు చెక్కెరను అందులో వేసి బాగా కలుపుకోవాలి(స్వీట్ ఎక్కువగా తినరు వారు కొంచెం తక్కువగా వేసుకున్నా పర్వాలేదు). తరువాత ఆ మిశ్రమంలో యాలకుల పొడి, కుంకుమ పువ్వుని వేసి బాగా కలుపుకోవాలి. ఇది సన్నటి మంట మీద వేడి అవుతూ ఉండాలి.
ఈ క్రమంలోనే మరొక పొయ్యి మీద.. ఒక చిన్న కడాయి పెట్టి.. అందులో నెయ్యి పోసి, బాదం, పిస్తా, కాజు వంటివి వేసి ఫ్రై చేసుకోవాలి. అనంతరం నెయ్యితో సహా.. ఈ డ్రై ఫ్రూట్స్‌ను మనం ముందుగా చేసి పెట్టుకున్న పస్థపైనా వేసి గార్నిన్స్ చేసుకోవాలి. అనంతరం వాటిని కలిపి ఒక కప్పులో తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. రుచిగా ఉండే, పాస్తా పాయసాన్నం సిద్ధమైనట్లే. ఒక్కసారి ఈ రెసిపీని చేసి తినండి, మళ్ళీ వదలరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications