Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మన పూర్వీకుల చికెన్ కూర ఇలానే చేసుకునేవారట,అందుకే వారికి రోగాలు రావు
ఇప్పుడైతే చికెన్‌తో రకరకాల వంటకాలు చేసుకుంటున్నారు. కానీ గతంలో కేవలం చికెన్ కూర మాత్రమే చేసుకునే వారు. మన అమ్మమ్మలు, నానమ్మలకు తెలిసింది అదొక్కటే. అది కూడా చాలా రుచికరమైన పద్దతిలో, ఆరోగ్యవంతంగా ఎలాంటి ఫ్యాన్సీ మెటీరియల్స్ వినియోగించకుండా ఆ కూరను ప్రిపేర్ చేసుకునే వారు. అయితే అదే పద్దతిలో మళ్ళీ చికెన్ కూర చేసుకోవాలనుకుంటే ఈ స్టోరీని పూర్తిగా చదవండి. ఈ స్టోరీలో పాతకాలంలో చికెన్ కూడా ఎలా వండుకునేవారో వివరించాము చదవండి.
పూర్వీకుల మాదిరిగా చికెన్ కూర వండడానికి కావాల్సిన పదార్థాలు
చికెన్
నూనె
ధనియాల పొడి
దంచి పెట్టుకున్న గరం మసాలా
నూరిన కారం
పసుపు
దాల్చిన చెక్క
ఆవాలు
లవంగాలు
రుచికి సరిపడా ఉప్పు

పూర్వీకుల మాదిరిగా చికెన్ కూడా వండుకునే విధానం
మన పూర్వీకుల మాదిరిగా చికెన్ కర్రీ తయారు చేసుకోవడం చాలా సులభం. అందుకోసం ముందుగా చికెన్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ చికెన్‌ను ఓ గిన్నెలో తీసుకొని అందులో నూరిన కారం, చిటికెడు పసుపు, ధనియాల పొడి గరం మసాలా వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి.
ఆ తరువాత ఆ చికెన్‌ను ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మట్టి పాత్ర తీసుకోవాలి. ఆ మట్టి పాత్రలో నూనె పోసుకోవాలి. నూనె వేగాక అందులో దాల్చిన చెక్క, లవంగాలు, ఆవాలు, వేసుకోవాలి. అవి కాస్త వేగాక.. అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి.
చికెన్ నుంచి నీరు ఊరాక, అందులో చికెన్ వండడానికి సరిపడా నీళ్లు వేసుకొని మూత పెట్టుకోవాలి. చికెన్ బాగా ఉడికాక అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరో అయిదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఆ తరువాత దానిపై కొత్తిమీర చల్లుకుంటే పూర్వీకుల స్టైల్‌లో చికెన్ కూర సిద్ధమైనట్లే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications