Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
నోరూరించే స్నాక్..ఒక్కసారి కీమా సమోసా తింటే జన్మలో వదలరు..ఎలా చేసుకోవాలంటే
సమోసా పేరు వింటే చాలామందికి నోట్లో నీళ్లూరిపోతుంటాయి. అయితే మనదేశంలొనే కాదండోయ్..చాలా దేశాల్లో కూడా ఇది పాపులర్ స్నాక్. ఆస్ట్రేలియా ప్రధాని సైతం స్వయంగా సమోసాని తయారుచేసి దీని టేస్ట్ అద్భుతం అని పొడిగారు. సాయంత్రం సమయంలో టీతో పాటు, పండగ సమయాల్లో లేదా చిన్న చిన్న పార్టీలలో సమోసాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. సాధారణంగా బంగాళాదుంపల స్టఫింగ్‌తో తయారుచేసే సమోసాలు మనకు బాగా పరిచయం. అయితే నాన్ వెజ్ ఇష్టపడేవాళ్లయితే ఒక్కసారి కీమా సమోసా టేస్ట్ చూడాల్సిందే. దీని రుచి మాటల్లో చెప్పలేం.
కీమా సమోసా అంటే మసాలాలతో నిండిన రుచికరమైన కీమా అంటే మెత్తగా చేసిన మాంసం మిశ్రమాన్ని సమోసా షెల్ లో నింపి, బంగారు గోధుమ రంగులోకి వేయించడం. దీని రుచి మాటల్లో చెప్పలేం. ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. కీమా సమోసా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

కీమా సమోసా తయారీకి కావాల్సిన పదార్థాలు
-మైదా పిండి: 2 కప్పులు
-ఉప్పు: 1/2 టీస్పూన్
-వాము: 1/2 టీస్పూన్
-నూనె లేదా నెయ్యి: 4-5 టేబుల్ స్పూన్లు
-నీరు: పిండి కలపడానికి తగినంత
-మేక/గొర్రె కీమా: 250 గ్రాములు
-ఉల్లిపాయలు: 2
-పచ్చిమిర్చి: 2-3
-అల్లంవెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
-టమాటో: 1 చిన్నది
-పసుపు: 1/2 టీస్పూన్
-కారం: 1 టీస్పూన్
-ధనియాల పొడి: 1 టీస్పూన్
-జీలకర్ర పొడి: 1/2 టీస్పూన్
-గరం మసాలా: 1/2 టీస్పూన్
-కొత్తిమీర: 2 టేబుల్ స్పూన్లు
-పుదీనా ఆకులు: 1 టేబుల్ స్పూన్
-నిమ్మరసం: 1 టీస్పూన్
-నూనె: 2 టేబుల్ స్పూన్లు
-ఉప్పు: రుచికి సరిపడా

కీమా సమోసా తయారుచేసే విధానం
-ఒక పెద్ద గిన్నెలో మైదా పిండి, ఉప్పు, వాము వేసి బాగా కలిపి అందులో నూనె లేదా నెయ్యి వేసి పిండికి బాగా పట్టేలా చేతులతో రుద్దాలి. పిండి నూనెను బాగా పీల్చుకున్న తర్వాత అది చేతిలో పట్టుకుంటే ముద్దలా మారాలి.
-కొద్దికొద్దిగా నీరు పోస్తూ గట్టిగా, సాగే గుణం లేని పిండిని కలపాలి. చపాతీ పిండిలా మెత్తగా ఉండకూడదు. ఇది సమోసా షెల్స్ క్రిస్పీగా రావడానికి సహాయపడుతుంది.
-కలిపిన పిండిని తడి వస్త్రంతో కప్పి కనీసం అరగంట సేపు పక్కన పెట్టాలి.
-తర్వాత ఒక పాన్ లో నూనె వేసి వేడి చేసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాక పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాక కీమా వేసి రంగు మారేవరకు హై ఫ్లేమ్ లో వేయించాలి.
-ఇప్పుడు అందులో పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. టమాటోలు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి.
-1/4 కప్పు నీళ్లు పోసి మూత పెట్టి కీమా పూర్తిగా ఉడికే వరకు, నీరు ఇగిరిపోయే వరకు ఉడికించాలి. దీనికి సుమారు 15-20 నిమిషాలు పడుతుంది. కీమా ఉడికేటప్పుడు దాని నుండి కూడా నీరు వస్తుంది కాబట్టి ఎక్కువ నీరు పోయకుండా చూసుకోవాలి.
-నీరంతా ఇగిరిపోయి కీమా పొడిపొడిగా మారిన తర్వాత గరం మసాలా, తరిగిన కొత్తిమీర, పుదీనా ఆకులు,నిమ్మరసం వేసి బాగా కలపాలి.
-స్టవ్ ఆఫ్ చేసి దీనిని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. స్టఫింగ్ పూర్తిగా చల్లబడిన తర్వాతే సమోసాలలో నింపాలి, లేదంటే పిండి మెత్తబడిపోతుంది.
-ఇప్పుడు మందు కలిపి పకర్కనపెట్టుకున్న పిండిని చిన్న చిన్న నిమ్మకాయ పరిమాణంలో ముద్దలుగా చేసుకోవాలి. ప్రతి ముద్దను ఓవల్ ఆకారంలో కొద్దిగా మందంగా రుద్దుకోవాలి.
-రుద్దిన పిండిని మధ్యలోకి కత్తిరించాలి తద్వారా రెండు అర్ధచంద్రాకార భాగాలు ఏర్పడతాయి. ఒక అర్ధచంద్రాకార భాగాన్ని తీసుకుని కోసిన అంచులో సగం భాగానికి నీరు అంటించి, శంకువు ఆకారాన్ని ఏర్పరచడానికి అతికించాలి. కోన్ అంచులను గట్టిగా నొక్కాలి తద్వారా వేయించేటప్పుడు తెరుచుకోవు.
-ఈ శంకువులో 1-2 టీస్పూన్ల కీమా స్టఫింగ్‌ను నింపాలి. మరీ ఎక్కువ నింపవద్దు.
-ఇప్పుడు శంకువు అంచులకు కొద్దిగా నీటిని అంటించి వాటిని కలిపి మూయాలి.
-ఒక లోతైన కడాయిలో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసి తక్కువ మంట మీద వేడి చేయాలి. నూనె మరీ వేడిగా ఉండకూడదు లేదంటే సమోసాలు బయట త్వరగా మాడిపోయి లోపల పచ్చిగా ఉంటాయి.
-నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు 3-4 సమోసాలను ఒకేసారి వేసి తక్కువ మంట మీద నెమ్మదిగా వేయించాలి.
-సమోసాలు బంగారు గోధుమ రంగులోకి మారేవరకు అప్పుడప్పుడు తిప్పుతూ వేయించాలి. దీనికి సుమారు 10-15 నిమిషాలు పట్టవచ్చు. నెమ్మదిగా వేయించడం వల్ల సమోసాలు లోపల వరకు ఉడికి, క్రిస్పీగా అవుతాయి.
-వేయించిన సమోసాలను నూనె నుండి తీసి, టిష్యూ పేపర్‌పై ఉంచి అదనపు నూనెను పీల్చుకోవాలి. వేడి వేడి కీమా సమోసాలను పుదీనా చట్నీ, టమాటో సాస్ లేదా మీకిష్టమైన ఏదైనా డిప్ తో సర్వ్ చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications