Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
రెస్టారెంట్ స్టైల్ సేమియా పాయసం..చిక్కబడకుండా టేస్టీగా..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే
సేమియా పాయసం, భారతీయ గృహాలలో అత్యంత ప్రియమైన తీపి వంటకాల్లో ఒకటి. ఇది త్వరగా, సులభంగా తయారుచేయగల వంటకం కావడంతో పాటు, రుచిలో అద్భుతంగా ఉంటుంది. పండుగలు, ప్రత్యేక సందర్భాలలో, లేదా సాధారణ రోజుల్లోనూ స్వీట్ గా దీనిని తయారుచేసుకుంటారు. ఈ పాయసం చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే దీనిని పక్కా కొలతలతో చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సేమియా పాయసంని పక్కా కొలతలతో మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
సేమియా పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు
-సేమియా
-కిస్మిస్
-జీడిపప్పు
-బాదంపప్పు
-నెయ్యి
-ఎండుకొబ్బరి
-పాలు
-చక్కెర
-యాలకల పొడి

సేమియా పాయసం తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెపెట్టి అందులో 3 కప్పుల నీళ్లు పోసి వేడి చెయ్యండి.
-నీళ్లు వేడెక్కేలోగా మరోపక్క స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేశాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు, 1 టీస్పూన్ బాదం ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ఎండుకొబ్బరి ముక్కలు, 1 టీస్పూన్ కిస్మిస్ చివర్లో వేసి ఇవన్నీ దోరగా లేత బంగారు రంగు వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకొని ఓ గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద ఉన్న కడాయిలో మిగిలి ఉన్న నెయ్యిలోనే 1 కప్పు సేమియా వేసి మీడియం మంట మీద 4-5 నిమిషాలు కలుపుతూ బంగారు రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి.
-ఇప్పుడు వేడి చేసిన నీటిని కడాయిలో కొంచెం కొంచెంగా పోసి కలిపి సేమియాను ఉడికించుకోవాలి. దీనికి 4-5 నిమిషాలు పడుతుంది.
-ఓ గిన్నెలో అరలీటరు పాలు పోసి వేడి చెయ్యాలి. వేడి చేసిన పాలను బాగా ఉడికిన సేమియాలో పోసి కలపండి. మంటను తక్కువలో ఉంచాలి.
-ఇప్పుడు అందులో అరకప్పు చక్కెర వేసి కలిపి 3-4 నిమిషాలు ఉడికించాలి.
-తర్వాత అందులో అర టీస్పూన్ యాలకల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి కలిపాక స్టవ్ ఆఫ్ చేసేయండి. కడాయి మీద మూత పెట్టి 10 నిమిషాలు వదిలేయండి. తర్వాత మూత తీస్తే టేస్టీ సేమియా పాయసం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications