Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
బరువు తగ్గాలంటే ఈ సొరకాయ దోశ తినాలి.. ఎలా చేసుకోవాలంటే?
మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో రకాల దోశలు ఉంటాయి. మసాలా దోశ, ఆనియన్ దోశ, ఎగ్ దోశ ఇలా ఎన్నో రకాల దోశలు ఉన్నాయి. అయితే బరువు తగ్గాలని అనుకుంటున్నా, ప్రతిరోజూ డైట్ చేస్తున్నా మీరు దోశను తినలేరు. అలాంటి వ్యక్తులు సులభంగా బరువు తగ్గడానికి సొరకాయ దోశను తీసుకోవచ్చు. దీనిని తినడం వల్ల మీ డైట్ ఏమాత్రం పాడవకపోవడంతో పాటు బరువు తగ్గేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సొరకాయ దోశ ఎలా తయారు చేయాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సొరకాయ దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు
మినపప్పు - 200 గ్రాములు
రెండు కప్పుల బియ్యం
రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము
కొద్దిగా కొత్తిమీర
ఒక కట్ట కరివేపాకు
మిరపకాయలు
అల్లం వెల్లుల్లి
జీలకర్ర
ఇంగువ
కొబ్బరి తురుము
రుచికి సరిపడా ఉప్పు
చిటికెడు తోటకూర పొడి
100 గ్రాముల ఒక సొరకాయ
సొరకాయ దోశ తయారీ విధానం
* ముందుగా ఒక పాత్రలో బియ్యం, మినపప్పు, చింతపండు తీసుకుని నీళ్లు
పోసి కనీసం 7 గంటలు నానబెట్టాలి.
* 7 గంటల పాటు నానబెట్టిన తర్వాత నీటితో రెండు సార్లు కడగాలి.
* తర్వాత మిక్సీ జార్లో కడిగిన బియ్యప్పిండిలో సగం పిండిని
తీసుకోవాలి. అలాగే అందులోనే మిరపకాయలు, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర,
ఇంగువ, కొబ్బరి తురుము వేసుకోవాలి.
* ఆ తర్వాత కొత్తిమీర, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, ఇంగువ పొడి
వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా రుబ్బుకోవాలి.
* తర్వాత ఆ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
* ఆ తర్వాత మిగిలిన బియ్యం పిండి, సొరకాయ ముక్కలు వేసి బాగా గ్రైండ్
చేయాలి.
* తర్వాత వేరు వేరుగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒకే దగ్గర సరిగ్గా
కలుపుకోవాలి. ఒకటికి రెండుసార్లు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి.
* కొంచెం నూనె రాసి, దోశను వేసుకోవాలి. రెండు వైపులా దోశను సరిగ్గా
కాల్చుకుంటే ఎంతో రుచికరమైన దోశ సిద్ధమైనట్లే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications