Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మామిడికాయ చికెన్ కర్రీ ఎప్పుడైనా తిన్నారా? 100 కోట్లు ఖర్చు చేసినా ఇలాంటిది దొరకదు,ఎలా చేయాలంటే
నాన్ వెజ్ వంటకాల్లో ఎక్కువమంది ఫేవరెట్ చికెన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. చికెన్ తో బోలెడు వెరైటీలు తయారుచేస్తుంటారు. దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. ఒకే కర్రీని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా తయారుచేస్తుంటారు. మీరెప్పుడైనా మామిడికాయ చికెన్ కర్రీ తిన్నారా? సమ్మర్ ప్రారంభంలో దొరికే మామిడికాయలతో దీనిని చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇంట్లోనే చాలా ఈజీగా మామిడికాయ చికెన్ కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
మామిడికాయ చికెన్ కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు
-పచ్చి మామిడికాయ
-చికెన్
-జీడిపప్పు
-ధనియాలు
-జీలకర్ర
-దాల్చిన చెక్క
-యాలకలు
-ఎండుమిర్చి
-పచ్చిమిర్చి
-మిరియాలు
-దాల్చిన చెక్క
-పసుపు
-ఉప్పు
-కారం
-వెల్లుల్లి
-అల్లం
-కరివేపాకు
-గరం మసాలా
-కొత్తిమీర
-ఆయిల్
-నీరు

మామిడికాయ చికెన్ కర్రీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అంగుళం దాల్చిన చెక్క,4 యాలకలు, 4 ఎండుమిర్చి, 5 లవంగాలు, అర టీస్పూన్ మిరియాలు, అర టీస్పూన్ జీలకర్ర వేసి సన్నని సెగ మీద మసాలాలు మంచి సువాసన వచ్చేదాకా వేయించాలి.
-తర్వాత ఈ మొత్తాన్ని మిక్సీ గిన్నెలో వేసి అందులో నానబెట్టిన 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు కూడా వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.
-తర్వాత మిక్సీ గిన్నెలో పొట్టుతీసిన 10 వెలుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క వేసి నీళ్లతో మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి 7 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి అందులో 1 కప్పు ఉల్లిపాయ తరుగు,ఉప్పు,2 రెమ్మలు కరివేపాకు వేసి వేయించండి.
-ఉల్లిపాయ ముక్కలు లేత బంగారు రంగులోకి మారిన తర్వాత అందులో మిక్సీలో చేసి పెట్టుకున్న అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేపండి.
-తర్వాత అందులో అరకేజీ చికెన్ ముక్కలు వేసి పెద్ద మంట మీద వేయించాలి.
-కొంచెం బాగా వేగిన తర్వాత అందులో అర టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల నీరు పోసి కలపండి.
-కారం వేగిన తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు మసాలాల పేస్ట్ వేసి కలపాలి.
-అందులోనే ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి కలిపి మూతపెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ ను 80శాతం వరకు ఉడకనివ్వాలి.
-తర్వాత అందులో అర కప్పు చెక్కు తీసిన కొంచెం పుల్లటి మామిడికాయ ముక్కలు వేసి మూతపెట్టి మూమిడి ముక్కలు మెత్తగా అయ్యేవరకు ఉడకనివ్వాలి. మూమిడికాయ పులపుని బట్టి ఉప్పు, కారం సరిచేసుకోవాలి.
-దింపబోయే ముందు అర టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలిపి నూనె పైకి తేలేంతవరకు ఒక్కఉడుకు వచ్చేదాకా ఉడికించి దించేయడమే. అంతే మామిడికాయ చికెన్ కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications