Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
అమ్మమ్మల కాలం నాటి సంప్రదాయ స్వీట్..ఇంట్లోనే మామిడి తాండ్ర ఎలా చేసుకోవాలంటే..
వేసవి కాలంలో నోరూరించే మామిడి పండ్ల రారాజుతో తయారుచేసే ఒక సాంప్రదాయక, రుచికరమైన రెసిపి మామిడి తాండ్ర. దీనిని ఆమ్ పాపడ్ అని కూడా పిలుస్తారు. మామిడి తాండ్ర అనేది మామిడి పండ్ల గుజ్జును ఎండబెట్టి, పలుచని పొరలుగా తయారుచేసే ఒక పద్ధతి. ఈ ప్రక్రియలో మామిడిలోని తేమను తొలగించి దాని సహజమైన తీపిని, సువాసనను సంరక్షిస్తారు. ఇది చాలా కాలం నిల్వ ఉండేలా చేస్తుంది. మామిడి తాండ్రకు భారతదేశంలో చాలా ప్రాచీన చరిత్ర ఉంది.
వేసవిలో మామిడి పండ్ల లభ్యత ఎక్కువగా ఉన్నప్పుడు, వాటిని నిల్వ చేసుకోవడానికి ఈ పద్ధతిని ఉపయోగించేవారు. ముఖ్యంగా గ్రామాల్లో ప్రతి ఇంట్లో మామిడి తాండ్రను తయారుచేయడం ఒక సంప్రదాయంగా ఉండేది. దేశంలోని వివిధ ప్రాంతాలలో దీనిని వివిధ పేర్లతో పిలుస్తారు. మన పొరుగు రాష్ట్రం ఒరిస్సాలో దీనిని మాంగా తింద్రా అని, మహారాష్ట్రలో ఆంబోలి అని, హిందీలో ఆమ్ పాపడ్ అని ఇలా రకరకాల పేర్లతో దీనిని తయారుచేస్తుంటారు. దీనిని తయారుచేయడాని పెద్ద కష్టపడనక్కర్లేదు కూడా. ఇంట్లోనే చాలా ఈజీగా మామిడి తాండ్రను ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

మామిడి తాండ్ర తయారీకి కావాల్సిన పదార్థాలు
-మామిడికాయలు
-చక్కెర లేదా బెల్లం
-నెయ్యి లేదా ఆయిల్
-మ్యాంగ్ ఎసెన్స్
-నిమ్మరసం
Desi Pasta: ఇండియన్ టచ్‌తో ఇటాలియన్ పాస్తా..నోరూరించే మసాలా మాక్రోని ఎలా చేసుకోవాలంటే
మామిడి తాండ్ర తయారీ విధానం
-ముందుగా బాగా పండిన 1 కేజీ మామిడికాయ ముక్కలు తీసుకోండి. ముక్క కోసుకునే మామిడిపండ్లు అయితే కరెక్ట్ గా ఉంటుంది.
-మామిడి పండ్ల ముక్కలపై ఉండే తొక్కను తీసేసి వాటిని మిక్సీ గిన్నెలో వేసి ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద మందంగా ఉండే కడాయిని పెట్టి అందులో గ్రైండ్ చేసుకున్న మామిడి పేస్ట్, పావు కేజీ చక్కెర లేదా బెల్లం తురుము అయినా వేసి అది కరిగేవరకు తక్కువ మంట మీద ఉంచాలి.
-తర్వాత అందులో 1 టీస్పూన్ నిమ్మరసం, పావు టీస్పూన్ మ్యాంగో ఎసెన్స్ వేసి కలిపి 10-15 నిమిషాలు తక్కువమంట మీద ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
-మ్యాంగో మిశ్రమాన్ని మరీ దగ్గరికి అయ్యేట్లు ఉడికించకూడదు.కొంచెం జెల్లీలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి లైట్ గా చల్లారనివ్వాలి.
-ఇప్పుడు ఓ స్టీల్ ఫ్లేట్ తీసుకొని దానీమిద 3 నెయ్యి చుక్కలు లేదా నూనె బొట్లు వేసి ప్లేట్ మొత్తం రుద్దాలి.
-తర్వాత మ్యాంగో మిశ్రమాన్ని దానిమీద సన్నని లేయర్ గా స్ప్రెడ్ చేయండి.
-ఇప్పుడు ఆ ప్లేట్ ని ఎండలో పెట్టి దానిమీద డస్ట్ పడకుండా పల్చటి గుడ్డ కప్పండి.
-2-3 రోజులు బాగా ఎండిన తర్వాత గట్టి లేయర్ గా ఏర్పడుతుంది. ఇప్పుడు దాన్ని ప్లేట్ లో నుంచి ఎడ్జెట్ ను జరుపుతూ మెల్లిగా తీసేయండి. అంతే మామిడి తాండ్ర రెడీ. దీనిని మీకు నచ్చిన షేపులో కట్ చేసుకొని వాటిని బాక్సుల్లో పెట్టుకుంటే సంవత్సరం మొత్తం వీటిని ఆస్వాదించవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications