Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
meal maker egg fry: మీల్ మేకర్ ఎగ్ ఫ్రై..ఇలా చేసుకుంటే మటన్ ని మించిన టేస్ట్
ఎగ్ తో అనేక రకాల వంటకాలను ట్రై చేసుకుంటారు. అలాగే మీల్ మేకర్ తో కూడా అనేక రకాల వంటకాలను ట్రై చేసి ఉంటారు. అయితే ఈ రెండు కలిపి వండితే ఎలా ఉంటదని ఎప్పుడైనా ఆలోచించారా? రుచి సూపర్ గా ఉంటుంది. మటన్ ని మించిన టేస్ట్ వస్తుందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. మీల్ మేకర్ ఎగ్ ఫ్రై ఇంట్లో చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. అద్భుతమైన రుచిని కలిగి ఉండే మీల్ మేకర్ ఎగ్ ఫ్రైని తయారు చేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
మీల్ మేకర్ ఎగ్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు
-3 కోడిగుడ్డు
-1 కప్పు మీల్ మేకర్
-కరివేపాకు
-కొత్తిమీర
-ఉప్పు
-కారం
-పసుపు
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-2 టమాటోలు
-3 స్పూన్ల ఆయిల్
-2 ఉల్లిపాయలు
-ధనియాల పొడి

మిల్ మేకర్ ఎగ్ ఫ్రై తయారీ విధానం
-ముందుగా ఓ బౌల్ లో 3 కోడిగుడ్లు కొట్టి బాగా కలపండి.
-తర్వాత స్టవ్ మీద ఒక కప్పు మీల్ మేకర్ ని ఉడికించండి. మిల్ మేకర్ నీళ్లలో వేసే ముందు అందులో కొంచెం ఉప్పు కూడా వేయండి.
-మీల్ మేకర్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మీల్ మేకర్ ని పిండి ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర,ఉల్లిపాయలు,కరివేపాకు,కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేసుకోండి.
-ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత అందులో కొంచెం అల్లం వెలుల్లి పేస్ట్, కారం,తగినంత ఉప్పు వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి.
-తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న రెండు టమాటో ముక్కలు వేసి కలిపి మూతపెట్టి మగ్గనివ్వండి.
-టమాటో ముక్కలు మగ్గిన తర్వాత అందులో నీళ్లు పిండేసిన మీల్ మేకర్ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి.
- పగటకొట్టి పక్కన ఉంచుకున్న కోడిగుడ్ల మిశ్రమాన్ని ఇందులో వేసి మంటను లో ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
-తర్వాత కొంచెం ధనియాల పొడి చల్లుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే మీల్ మేకర్ ఎగ్ ఫ్రై రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications