ఒక్క ముద్దలో లెక్కలేనన్ని ప్రయోజనాలు.. వయసు మళ్లినవారు తప్పనిసరిగా తినాల్సిన హెల్తీ కుర్మా.!

మొలకెత్తిన గింజల్లో శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. గుప్పెడు మొలకల్లో ఉండే పోషక సమృద్ధి అంతా ఇంతా కాదు. విటమిన్లు, ప్రొటీన్లు, ఫైబర్‌, ఐరన్‌, కాల్షియం, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. మొలకలను కూరగా వండుకుంటే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఫైబర్‌ మలబద్ధకాన్ని నివారిస్తుంది. కేలరీలు తక్కువగా ఉండటంతో బరువు నియంత్రణలో ఉంటుంది. త్వరగా కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ను పంచి ఇన్‌ఫెక్షన్‌ను నుంచి కాపాడతాయి.

mixed sprouts curry recipe for weight loss and rich protein healthy dinner

పెసర్లు, శనగలు, అలసందలతో వచ్చిన మొలకల ద్వారా మిక్స్‌డ్‌ స్ప్రౌట్స్‌ కర్రీని ఇలా చేశారంటే అన్నం, చపాతీల కంటే ఎక్కువగా కూరనే తినేస్తారు. మిక్స్‌డ్‌ మొలకల కర్రీని ఎలా తయారుచేయాలో చూద్దాం..

తమిళుల ఆరోగ్య రహస్యం.. ప్రొటీన్‌, ఫైబర్‌ పుష్కలంగా ఉండే తంజావూర్‌ అడై.. ఒక్కటి తిన్నా చాలు.!

మిక్స్‌డ్‌ మొలకల కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు

నల్ల మిరియాలు- అర టీస్పూన్‌
పచ్చి కొబ్బరితురుము- పావు కప్పు
అల్లం- చిన్న ముక్క
పచ్చిమిర్చి- రెండు
జీలకర్ర- అరటీస్పూన్‌
పుదీనా ఆకులు- 20
కొత్తిమీర- గుప్పెడు
నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు
ఉల్లిపాయ- ఒకటి(మీడియం సైజు)
టమాటాలు- రెండు
ఉప్పు- రుచికి సరిపడా
పసుపు- పావు టీస్పూన్‌
ధనియాల పొడి- టీస్పూన్‌
మొలకెత్తిన పెసర్లు, శనగలు, అలసందలు- ఒకటి పావు కప్పు
వేడి నీళ్లు- ఒకటిన్నర కప్పు
కసూరి మెంతి- టీస్పూన్‌
కొత్తిమీర- కొద్దిగా
గరం మసాలా- పావు టీస్పూన్‌

మిక్స్‌డ్‌ మొలకల కర్రీ తయారీ విధానం

ముందుగా మిక్సీ జార్‌లో నల్ల మిరియాలు, పచ్చి కొబ్బరితురుము, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, పుదీనా ఆకులు, కొత్తిమీర వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.

పచ్చిమిర్చి ఊరగాయ ఇలా చేస్తే..ఒక్క ముద్ద తినేవాళ్లు నాలుగు ముద్దలు లాగించేస్తారు!

స్టవ్‌పైన కుక్కర్‌ పెట్టి రెండు టేబుల్‌ స్పూన్ల వేసి వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసి దోరగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఉప్పు, పసుపు వేసి కలపాలి. ఇప్పుడు గ్రైండ్‌ చేసిన పేస్ట్‌ వేసి బాగా కలిపి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. ధనియాల పొడి వేసి కలిపి కాసేపు ఉడికించాలి.

mixed sprouts curry recipe for weight loss and rich protein healthy dinner

మసాలా మగ్గిన తర్వాత మొలకెత్తిన పెసర్లు, శనగలు, అలసందలు వేసి ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి. తర్వాత వేడి నీళ్లు పోసి కలిపి కుక్కర్‌ మూత పెట్టి మూడు విజిల్స్‌ వచ్చేవరకు ఉంచాలి.

స్టవ్‌ ఆఫ్‌ చేసి కాసేపటి తర్వాత మూత తీసి కసూరి మెంతి వేసి కలపాలి. కొత్తిమీర, గరం మసాలా వేసి కలిపి దించుకోవాలి. చపాతీల్లోకి ఈ కూరను వేడివేడిగా సర్వ్‌ చేసుకుంటే ఈ కాంబినేషన్‌ అద్భుతంగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Wednesday, September 9, 2026, 18:05 [IST]
Desktop Bottom Promotion