తమిళుల ఆరోగ్య రహస్యం.. ప్రొటీన్‌, ఫైబర్‌ పుష్కలంగా ఉండే తంజావూర్‌ అడై.. ఒక్కటి తిన్నా చాలు.!

సాధారణంగా మన తెలుగు ఇళ్లలో బ్రేక్‌ఫాస్ట్‌ అంటే ఎక్కువగా ఇడ్లీలు, దోశలు గుర్తొస్తాయి. కానీ వాటిలో ఎక్కువగా కార్బొహైడ్రేట్లు నిండి ఉంటాయి. ఇంకా ప్రొటీన్‌, ఫైబర్‌ తక్కువగా ఉంటుంది. దీంతో ఈజీగా బరువు పెరగడంతో పాటు డయాబెటిస్‌ వంటి దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుంది. కానీ దానికి బదులుగా ఈ ఆరోగ్యకరమైన తంజావూర్‌ అడైని మీ డైట్‌లో చేర్చుకోండి. దోశల మాదిరిగా ఈజీగా చేసుకునే ఈ ప్రత్యేక వంటకాన్ని టిఫిన్‌ లేదా డిన్నర్‌లోకి కూడా తీసుకోవచ్చు.

Thanjavur adai tamilians health secret with rich fiber and protein know the process

వైద్యుల సలహా ప్రకారం శరీరానికి కార్బొహైడ్రేట్లు, ఫైబర్‌, ప్రొటీన్‌ అన్నీ సమపాళ్లలో ఉండాలి. కానీ మనం రెగ్యులర్‌గా తీసుకునే ఆహారంలో ఎక్కువగా కార్బ్స్‌ నిండి ఉంటున్నాయి. దీంతో బరువు పెరగడంతో పాటు ఇతరత్రా ఆరోగ్య సమస్యలకి దారితీస్తున్నాయి. దానికి సరైన పరిష్కారం తమిళుల ఆరోగ్య రహస్యం తంజావూర్‌ అడై. ఇందులో ప్రొటీన్‌, ఫైబర్‌ సమృద్ధిగా ఉండటంతో పాటు పిండిపదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. వారానికి ఒకసారి ఈ తంజావూర్‌ అడైని మీ డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆరోగ్యకరమైన రెసిపీ.

తంజావూర్‌ అడై తయారీకి కావాల్సిన పదార్థాలు

ఉప్పుడు బియ్యం- అర కప్పు
సాధారణ బియ్యం- అర కప్పు
పచ్చి శనగపప్పు- అర కప్పు
కందిపప్పు- అర కప్పు
పొట్టు మినప్పప్పు- అర కప్పు
ఎండుమిర్చి- 10
పచ్చి కొబ్బరి ముక్కలు- పావు కప్పు
సొరకాయ తురుము- ఒకటిన్నర కప్పు

తంజావూర్‌ అడై తయారీ విధానం

తంజావూర్‌ అడై తయారీ కోసం ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకుని అందులో పైన పేర్కొన్న కొలతల మేరకు ఉప్పుడు బియ్యం, సాధారణ బియ్యం, పచ్చి శనగపప్పు, కందిపప్పు, పొట్టు మినప్పప్పు, ఎండు మిర్చి, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి రెండు సార్లు బాగా కడగాలి. తర్వాత నీళ్లు పోసి గంటపాటు నానబెట్టుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్‌ తీసుకుని నానబెట్టిన దినుసులను కొన్ని నీళ్లు పోసి మరీ మెత్తగా కాకుండా, మరీ బరకగా కాకుండా గ్రైండ్‌ చేసుకోండి. బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ చేసుకుని సొరకాయ తురుము వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, అవసరమైతే కొన్ని నీళ్లు పోసి కలపండి.

Thanjavur adai tamilians health secret with rich fiber and protein know the process

స్టవ్‌పైన దోశ పెనం పెట్టుకుని వేడయ్యాక పిండిని గరిటెతో తీసుకుని ఊతప్పం మాదిరిగా మందంగా పోసుకోవాలి. తర్వాత దోశ అంచుల వెంబడి కొద్దిగా నూనె అప్లై చేసి, పైనుంచి కొద్దిగా నూనె చల్లి మూత పెట్టి మీడియం మంటపైన కాల్చుకోండి.

దోశ ఒకవైపు కాలిన తర్వాత గరిటెతో రెండో వైపు తిప్పుకొని కొద్దిగా నూనె అప్లై చేసి ఒక 30 సెకన్ల పాటు ఉంచండి. ఇనుప పెనంపైన చేసినట్లయితే ఈ దోశలు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి.

దోశ రెండువైపులా కాలిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకోండి. ఇలాగే అన్నిటినీ ప్రిపేర్‌ చేసుకోవాలి. హెల్తీ తంజావూర్‌ అడై రెడీ. దీనిని తమిళులు ఎక్కువగా కొబ్బరి చట్నీ, నెయ్యి లేదా వెన్నతో తింటుంటారు.

[ of 5 - Users]
Story first published: Wednesday, September 9, 2026, 15:14 [IST]
Desktop Bottom Promotion