For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెసరపప్పు కోషాంబరి తయారీ ; హెసరు బేలే కోషాంబరిని ఎలా తయారు చేయాలి

పెసరపప్పు కోషంబరి కన్నడ భోజనంలో సంప్రదాయక సలాడ్ వంటకం. అన్ని పండగలప్పుడూ చేసే ఈ వంటకాన్ని హెసెరు బేలే కోషంబరి అని కూడా అంటారు. ఎలా తయారుచేస్తారో, ఈ వరుస పాయింట్ల ప్రకారం, చిత్రాలు ,వీడియో సాయంతో నేర్చ

Posted By: Deepthi
|

కర్ణాటకలో పండగల సమయాల్లో చేసుకునే సంప్రదాయపు సలాడ్ వంటకం పెసరపప్పు కోషంబరి. ఇది కన్నడ భోజనంలో తప్పనిసరి. కోషాంబరి అనే ఈ సలాడ్ నానబెట్టిన పెసరపప్పు, క్యారెట్, దోసకాయ, పచ్చి మామిడి వంటి కూరగాయలతో తయారయ్యేది. ఇది, మహారాష్ట్ర సలాడ్ పెసరపప్పు కోషింబిర్ దాదాపు ఒకటే.

హెసరు బేలే కోషాంబరి సులువుగా, త్వరగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ప్రొటీన్లు అధికంగా ఉండే ఈ సలాడ్ ను శాకాహారం డైట్ లో భాగంగా తీసుకోవచ్చు. ఈ ఆరోగ్యకర సలాడ్ ను ఇంట్లో తయారుచేయాలనుకుంటే కింద ఇచ్చిన తయారీ విధానాన్ని, బొమ్మలను, వీడియోను చూసి చేయండి.

పెసరపప్పు కోషంబరి తయారీ వీడియో

పెసరపప్పు కోషాంబరి తయారీ । హెసరు బేలే కోషాంబరి తయారీ ఎలా । పెసరపప్పు కోషింబిర్ తయారీ । పెసరపప్పు సలాడ్
పెసరపప్పు కోషాంబరి తయారీ । హెసరు బేలే కోషాంబరి తయారీ ఎలా । పెసరపప్పు కోషింబిర్ తయారీ । పెసరపప్పు సలాడ్
Prep Time
1 Hours
Cook Time
5M
Total Time
1 Hours 5 Mins

Recipe By: అర్చన వి

Recipe Type: సలాడ్

Serves: 2 కి

Ingredients
  • నానబెట్టిన పెసరపప్పు - 200 గ్రాములు

    దోసకాయ (చెక్కుతీసి, తరిగినది) - మధ్యమ సైజులో సగం

    క్యారెట్ (చెక్కుతీసి కోరినది ) - 1 మధ్యమ సైజుది

    పచ్చి తోతాపురి మామిడి (తరిగినది) - పావు కప్పు

    కొబ్బరి (కోరినది) - 2చెంచాలు

    అల్లం ( ముక్కలు) - పావు అంగుళం పరిమాణం

    పచ్చిమిర్చి ( ముక్కలు) - 1 చెంచా

    నూనె - 1 చెంచా

    ఆవాలు - 1చెంచా

    ఇంగువ - పావు చెంచా

    కరివేపాకు - 5-6

    నిమ్మరసం - అరచెక్క నిమ్మకాయ

    ఉప్పు తగినంత

    కొత్తిమీర ( తరిగినది) - 1 చెంచా

How to Prepare
  • 1. నానబెట్టిన పెసరపప్పు ఒక గిన్నెలో తీసుకోండి.

    2. దోసకాయ, క్యారెట్, పచ్చి మామిడిని వేయండి.

    3. బ్బరి, అల్లం, పచ్చిమిర్చి ముక్కలను వేయండి.

    4. వేడి కడాయిలో నూనె వేసి,ఆవాలను వేయించండి.

    5. వేగాక అందులో కరివేపాకు, ఇంగువను వేసి పోపును తయారుచేయండి.

    6. ఆ పోపును సలాడ్ లో వేయండి.

    7. నిమ్మరసం, ఉప్పు వేయండి.

    8. అన్నిటినీ బాగా కలపండి.

    9. కొత్తిమీరను పైన చల్లి మళ్ళీ బాగా కలపండి.

Instructions
  • 1. నానబెట్టేముందు పెసరపప్పును బాగా కడగాలి.
  • 2. పెసరపప్పును గంటపాటు నానబెట్టి మిగిలిన నీళ్ళను పారబోయాలి.
  • 3. నీరంతా బయటకి రాకుండా ఉండటానికి, ఉప్పును ఆఖరున వేయండి.
Nutritional Information
  • సరిపోయే పరిమాణం - 1 కప్పు
  • క్యాలరీలు - 87 క్యాలరీలు
  • కొవ్వు - 4 గ్రాములు
  • ప్రొటీన్లు - 4గ్రాములు
  • చక్కెర - 6గ్రాములు
  • ఫైబర్ - 3 గ్రాములు
  • ఐరన్ - 6%
  • విటమిన్ సి - 29%

స్టెప్ బై స్టెప్ - పెసర పప్పు కోషాంబరి తయారీ ఎలా

1. నానబెట్టిన పెసరపప్పు ఒక గిన్నెలో తీసుకోండి.

2. దోసకాయ, క్యారెట్, పచ్చి మామిడిని వేయండి.

3. బ్బరి, అల్లం, పచ్చిమిర్చి ముక్కలను వేయండి.

4. వేడి కడాయిలో నూనె వేసి,ఆవాలను వేయించండి.

5. వేగాక అందులో కరివేపాకు, ఇంగువను వేసి పోపును తయారుచేయండి.

6. ఆ పోపును సలాడ్ లో వేయండి.

7. నిమ్మరసం, ఉప్పు వేయండి.

8. అన్నిటినీ బాగా కలపండి.

9. కొత్తిమీరను పైన చల్లి మళ్ళీ బాగా కలపండి.

[ 4 of 5 - 38 Users]
English summary

పెసరపప్పు కోషాంబరి తయారీ । హెసరు బేలె కోషాంబరి తయారీ ఎలా । పెసరపప్పు కోషింబిర్ తయారి । పెసరపప్పు సలాడ్ । కోషాంబరి తయారీ

Moong dal kosambari is an authentic salad of the Kannada cuisine and is prepared during all auspicious events. Learn how to make the hesaru bele kosambari.
Desktop Bottom Promotion