Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
మీరు జన్మలో తినని చికెన్ కర్రీ రసం.. ఒక్కసారి తింటే రుచి అస్సలే మర్చిపోరు! ఎలా చేసుకోవాలంటే?
చికెన్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ ఇష్టం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా, లొట్టలేసుకుని మరీ తింటారు. చికెన్‌తో ఎన్నో రకాల వంటకాలు చేసుకుంటూ ఉంటారు. అందులో ముఖ్యంగా అందరూ కర్రీ చేసుకుంటూ ఉంటారు. అందుకే చాలా మందికి అదే తరహా కర్రీలు మళ్లీ మళ్లీ తింటే వదిలేయాలనిపిస్తుంది. అలాంటి వేళల్లో ఓ కొత్త రుచి కోసం స్పైసీ, టంగీ కాంబినేషన్లో తయారు చేసుకునే "పెప్పర్ రసం చికెన్" బెస్ట్. ఈ వంటకం సులభంగా తయారవుతుంది. పక్కా హోంమేడ్ ఫ్లేవర్‌తో ఇంట్లో అందరూ ఫిదా అయిపోతారు. అన్నం, బిర్యానీ, లేదా పులావ్‌తో చక్కగా సరిపోతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చికెన్ కర్రీ రసం తయారీకి అవసరమైన పదార్థాలు:
చికెన్ - 500 గ్రాములు (చిన్న ముక్కలుగా)
ఉప్పు - రుచికి తగినంత
పసుపు - అర చెంచా
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయ - సన్నగా తరిగినవి, ½ కప్పు
చింతపండు - నిమ్మకాయ పరిమాణంలో (నీటిలో నానబెట్టాలి)
టమాటా - సన్నగా కట్ చేసి ¼ కప్పు
మిరియాల పొడి - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
రసం పొడి - 1 టీస్పూన్
జీలకర్ర - ½ టీస్పూన్
ఆవాలు - 1 టీస్పూన్
ఎండుమిర్చి - 2
కరివేపాకు - కొన్ని రెబ్బలు
కొత్తిమీర - తరిగినది, ఓ గుప్పెడు
నూనె - 2 టేబుల్ స్పూన్లు

చికెన్ కర్రీ రసం తయారీ విధానం:
ముందుగా చికెన్ తయారీ
చికెన్ ముక్కలు కడిగి, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి దాదాపు 15 నిమిషాలు మరిగించాలి.
తాండూరి బేస్ తయారీ
ఒక పాన్‌లో నూనె వేడి చేసి, అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి సన్నని మంట మీద వేయించాలి.
ఉల్లిపాయ & టమాటా మిశ్రమం
ఇప్పుడు ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించి, తర్వాత
టమాటా ముక్కలు వేసి అవి మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి.
అర్థగంటలో రెడీ అయ్యే ది బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఇది.. సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూడండి!
చికెన్ వేసే దశ
టమాటా మిశ్రమంలో ముందుగా మెరినేట్ చేసిన చికెన్‌ను వేసి, దానితో పాటు మిరియాల పొడి, ధనియాల పొడి కూడా కలిపి, 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి.
రసం కలపడం
నానబెట్టిన చింతపండు రసాన్ని వడకట్టి, చికెన్ మిశ్రమంలో వేసి, అందులో 1 గ్లాసు నీరు పోసి బాగా కలపాలి. ముక్కలు బాగా ఉడికే వరకు ఉంచాలి.
తుది మెరుగులు
చివరగా రసం పొడి, కొత్తిమీర కలిపి 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.
సర్వింగ్ టైమ్
ఒక్కసారి ఈ కర్రీను వేడి వేడి అన్నం, జీర రైస్, లేదా గోంగూర పులావ్‌తో జత చేస్తే చాలు. రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీరు రుచి మర్చిపోలేరు. చికెన్‌లో రసం ఘుమ ఘుమ లాడుతుంది, మిరియాల స్పైసీ టచ్‌తో మైండ్ ఫ్రెష్ అవుతుంది. అలాగే చాలా రుచికరంగా ఉంటుంది. ఒక్కసారి ఈ వంట తింటే జీవితంలో మీరు మళ్ళీ వదలరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications