Latest Updates
-
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
2024లో గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన చట్నీ ఇదే.. ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి!
మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో చట్నీలు, పొడులు చేసుకుంటూ ఉంటాం. అయితే 2024లో అత్యంత ఎక్కువగా సెర్చ్ చేసిన చట్నీ పొడిగా చమ్మంది పొడి నిలిచింది. దీనిని ఎక్కువగా కర్ణాటకలో చేసుకుంటూ ఉంటారు. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. ఈ పొడి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఏ విధంగా ఈ పొడి చట్నీని చేసుకోవాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చమ్మంది పొడి తయారీకి కావాల్సిన పదార్థాలు
- రెండు కప్పుల సన్నగా తరిమిన కొబ్బరి
- పావు కప్పు వేరు శనగ పప్పులు
- ఎనిమి లేదా పది ఎండు మిరపకాయలు
- గుప్పెడు కరివేపాకులు
- చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు
- చిటికెడు ఇంగువ
- రుచికి సరిపడా ఉప్పు

చమ్మంది పొడి తయారు చేసే విధానం
ఈ చమ్మంది పొడి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక దళసరి పాన్‌ను తీసుకోవాలి. దానిని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో కొబ్బరి తురుము వేసుకోవాలి. తక్కువ మంటపైన ఆ కొబ్బరి తురుమును లేత గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. దళసరి పాన్ లేకపోతే కొబ్బరిని వేయించేటప్పుడు అడుగు కింద భాగం బాగా కాలిపోతుంది. అందుకే దళసరి పాన్‌ను తీసుకోవాలి.
కొబ్బరి తురుము వేయించేటప్పుడు అందులో గుప్పెడు కరివేపాకులు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఆ కొబ్బరి తురుమును వేరే పాత్రలో తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే పాన్‌లో పల్లీలను వేసుకొని వేయిచుకోవాలి. అలాగే ఎండు మిరపకాయలు, మిరియాలు, చింతపండు కూడా వేసుకొని వేయించుకోవాలి.
అవన్నీ బాగా వేగాకా.. వాటన్నిటినీ ఒక మిక్సీలో తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే చిటికెడు ఇంగువ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. అంతే గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన చమ్మంది పొడి సిద్ధమైనట్లే. దీనిపై ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి. ఆ చట్నీ రుచికి మీరు మైమరిచిపోతారు అంతే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications